Nidhan
బజ్‌బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్ వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీనిపై బీసీసీఐ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యాడు. ఆ జట్టుకు ఈ దుస్థితి రావడానికి అతనొక్కడే కారణమన్నాడు.
బజ్‌బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్ వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీనిపై బీసీసీఐ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యాడు. ఆ జట్టుకు ఈ దుస్థితి రావడానికి అతనొక్కడే కారణమన్నాడు.
Nidhan
సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరును ప్రవేశపెట్టింది ఇంగ్లండ్. అటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రతి మ్యాచ్‌లో రిజల్ట్ తీసుకురావడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చింది. మూడ్నాలుగు రోజుల్లోనే మ్యాచులు ముగిసిపోవడంతో ఇదేదో బాగుందని అంతా అనుకున్నారు. పెద్ద పెద్ద జట్లను కూడా బజ్‌బాల్‌తో భయపెట్టి విజయాలు సాధించింది స్టోక్స్ సేన. కానీ దీనికి అసలైన ఛాలెంజ్ మాత్రం ఉపఖండ పిచ్‌లపై ఎదురవుతుందని ఊహించలేకపోయింది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ టీమ్ బజ్‌బాల్ క్రికెట్‌తోనే గెలిచేస్తామని బడాయికి పోయింది. కానీ టీమిండియా దెబ్బకు నాలుగు టెస్టుల్లో మూడింట ఓడి.. ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టు వరుస ఓటములపై బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ రియాక్ట్ అయ్యాడు.
ఇంగ్లండ్ వరుస ఓటములకు బెన్ స్టోక్స్ దూకుడే కారణమని రోజర్ బిన్నీ ఆరోపించాడు. అనవసరంగా దూకుడు చూపించడం మంచిది కాదని.. అది ఇంగ్లీష్ టీమ్ కొంప ముంచిందన్నాడు. ధర్మశాల వేదికగా ప్రారంభమైన ఐదో టెస్టుకు హాజరైన బిన్నీ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ సిరీస్‌లో స్టోక్స్ చాలా అగ్రెసివ్‌గా వ్యవహరించాడు. ఆ టీమ్ ఓటములకు అతడి అనవసర దూకుడే కారణం. సిచ్యువేషన్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయకుండా టీమిండియా స్పిన్నర్ల మీద ఎదురుదాడికి దిగడం ఆ జట్టు ఓటమిని శాసించింది. అదే టైమ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వ్యూహాత్మకంగా, ఓపికగా వ్యవహరించాడు. అది మన టీమ్‌కు ఎంతగానో కలిసొచ్చింది. తనకు కావాల్సింది బౌలర్ల నుంచి హిట్‌మ్యాన్ రాబట్టాడు. ఓపిక వల్లే విజయాలు దక్కుతాయి’ అని రోజర్ బిన్నీ చెప్పుకొచ్చాడు.
ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చిన ఫస్ట్ టెస్ట్‌లో గెలవడంతో ఇంగ్లండ్ తన వ్యూహాలు మార్చుకోలేదని.. అదే అటాకింగ్ అప్రోచ్‌ను కంటిన్యూ చేసిందన్నాడు బిన్నీ. కానీ రోహిత్ మాత్రం ఓపిగ్గా ఉంటూ సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడని మెచ్చుకున్నాడు. తొలి టెస్టులో ఈజీగా నెగ్గాల్సిందని.. కానీ ఓటమి ఎదురవడంతో మిగిలిన రెండు టెస్టుల్లో ఓపిగ్గా ఉంటూ తన ప్లాన్స్‌కు అమలుపర్చుకుంటూ విజయం సాధించాడని వ్యాఖ్యానించాడు. రెండు జట్ల సారథుల మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఇదేనని తెలిపాడు. స్టోక్స్ అనవసర దూకుడును పక్కనబెట్టి సిచ్యువేషన్‌కు తగ్గట్లుగా డిసిషన్స్ తీసుకొని ఉంటే ఇంగ్లండ్‌కు ఘోర పరాజయాలు వచ్చేవి కాదన్నాడు. మరి.. ఇంగ్లీష్ టీమ్ ఈ దుస్థితికి స్టోక్స్ కారణమంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: అశ్విన్-కుల్దీప్ మధ్య ఆసక్తికర సన్నివేశం.. మ్యాచ్ కు ఇదే హైలెట్!
BCCI president Roger Binny feels that England skipper Ben Stokes’ aggressive captaincy is the reason for their downfall.#INDvsENG #EnglandCricket #RogerBinny #BenStokes #CricketTwitter pic.twitter.com/IPUhoJAWn8
— InsideSport (@InsideSportIND) March 7, 2024