iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: జడేజాకు అన్యాయం! నాటౌట్‌ అయినా.. ఔట్‌గా ప్రకటించారు? సెంచరీ మిస్‌..

  • Published Jan 27, 2024 | 1:25 PMUpdated Jan 27, 2024 | 3:25 PM

భారత స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. అతడు నాటౌట్ అయినా.. ఔట్​గా ప్రకటించారు. జడ్డూ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. అతడు నాటౌట్ అయినా.. ఔట్​గా ప్రకటించారు. జడ్డూ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 27, 2024 | 1:25 PMUpdated Jan 27, 2024 | 3:25 PM
Ravindra Jadeja: జడేజాకు అన్యాయం! నాటౌట్‌ అయినా.. ఔట్‌గా ప్రకటించారు? సెంచరీ మిస్‌..

క్రికెట్​లో కొన్ని రూల్స్ అటు ఆటగాళ్లతో పాటు ఇటు మ్యాచులు చూసే ఆడియెన్స్​కు కూడా చిరాకు పుట్టిస్తాయి. వాటి వల్ల ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతారు. ఇదేం రూల్​ రా బాబు అని ప్రేక్షకులు కూడా అసంతృప్తికి లోనవుతారు. అలాంటి ఓ నిబంధన వల్ల టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతడ్ని ఆ రూల్ ఆపేసింది. మూడంకెల మార్క్​ను చేరుకొని భారత్​కు మరింత లీడ్ అందిద్దామని అనుకున్న జడ్డూను క్రీజు వీడేలా చేసిందా రూల్. అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్. క్రికెట్​లో బాగా చర్చనీయాంశమైన నిబంధనల్లో ఇదొకటి. దీని వల్ల కొన్నిసార్లు బౌలర్లు, ఫీల్డర్లు ఇబ్బందిపెడితే.. మరికొన్ని సందర్భాల్లో బ్యాటర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. క్యాచులు, ఎల్బీడబ్ల్యూల కోసం ఈ రూల్​ను ఎక్కువగా వాడతారు. కన్​క్లూజివ్ ఎవిడెన్స్ దొరకని టైమ్​లో బెనిఫిట్ ఆఫ్​ డౌట్​ను యూజ్ చేస్తారు. అలాంటి ఈ రూల్ వల్ల జడేజాకు అన్యాయం జరిగింది.

బెనిఫిట్ ఆఫ్​ డౌట్ కింద నాటౌట్ అయినా జడేజాను ఔట్​గా ప్రకటించారు అంపైర్లు. దీంతో 87 పరుగులు చేసిన అతడు బాధతో క్రీజును వీడాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ వేసిన బాల్​కు జడ్డూ బ్యాట్​ను అడ్డంగా పెట్టాడు. కానీ బాల్ ప్యాడ్స్​కు తగలడం, వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ బాల్ బ్యాట్​కు తగలడంతో కాన్ఫిడెంట్​గా ఉన్న జడ్డూ రివ్యూకు వెళ్లాడు. అయితే అల్ట్రాఎడ్జ్​లో బాల్ ఒకేసారి బ్యాట్​తో పాటు ప్యాడ్స్​కు తాకినట్లు తేలింది. బాల్ ముందుగా బ్యాట్​ను తాకిందా? లేదా ప్యాడ్స్​ను తాకిందా అనే దాని మీద థర్డ్ అంపైర్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. బెనిఫిట్ ఆఫ్​ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో అదే నిర్ణయానికి కట్టుబడి జడ్డూను ఔట్​గా ప్రకటించాడు. దీంతో షాకైన స్టార్ ఆల్​రౌండర్ నిరాశతో క్రీజును వీడాడు. బాగా ఆడుతున్న తరుణంలో చెత్త రూల్ వల్ల ఔట్ కావడం, సెంచరీ మిస్సవడంతో బాధతో కనిపించాడు. ఆ విధంగా బెని​ఫిట్ ఆఫ్​ డౌట్ కింద జడ్డూకు అన్యాయం జరిగింది.

jadeja not out

జడ్డూకు జరిగిన అన్యాయం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. చెత్త రూల్ వల్ల అతడు సెంచరీ మిస్సయ్యాడని అంటున్నారు. ఇలాంటి నిబంధనలు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి రివ్యూకు వెళ్తే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎల్బీడబ్ల్యూలు, క్యాచులు లాంటి వాటిల్లో పూర్తి నిర్ణయం థర్డ్ అంపైర్​కే వదిలేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో రోహిత్ సేన 436 పరుగులు చేసింది. కీలకమైన 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండో ఇన్నింగ్స్​ స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ టీమ్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 89 పరుగులతో ఉంది. భారత్ స్కోరుకు ఆ జట్టు ఇంకా 101 పరుగుల దూరంలో ఉంది. వికెట్ స్పిన్​కు అనుకూలిస్తే మన బౌలర్లు చెలరేగుతారు. కాబట్టి మ్యాచ్ ఇవాళే ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. జడేజాకు అన్యాయం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి