Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బజ్‌బాల్‌తో భయం లేదని.. తమ దగ్గర బూమ్‌బాల్ ఉందన్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బజ్‌బాల్‌తో భయం లేదని.. తమ దగ్గర బూమ్‌బాల్ ఉందన్నాడు.
Nidhan
భారత పర్యటనకు ఇంగ్లండ్ వస్తోందనగానే క్రికెట్ ప్రపంచం మొత్తం ఇటు వైపు ఆసక్తిగా చూసింది. బజ్‌బాల్ ఫార్ములాతో టాప్ టీమ్స్‌ను భయపెట్టిన ఇంగ్లీష్ టీమ్ స్పిన్‌కు అనుకూలించే ఇండియన్ ట్రాక్స్‌పై ఎలా ఆడుతుందోననేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే తొలి టెస్టులో గెలుపుతో సిరీస్‌ను ఘనంగా స్టార్ట్ చేసింది ఇంగ్లండ్. బజ్‌బాల్‌తో రోహిత్ సేనను కట్టిపడేసింది. దీంతో టీమిండియా పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అద్భుతంగా పుంజుకొని 106 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతడి బంతుల్ని ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బ్యాటర్లు వణికిపోయారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లులు కురిపించాడు.
వైజాగ్ టెస్టులో బుమ్రా అసాధారణంగా బౌలింగ్ చేశాడని.. అసలు సిసలైన పెర్ఫార్మెన్స్తో భారత్‌ను గెలిపించాడని అశ్విన్ అన్నాడు. బజ్‌బాల్ కాదు.. బూమ్‌బాల్ (బుమ్రా) తోపు అని చెప్పాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా అవతరించిన బుమ్రాకు అశ్విన్ అభినందనలు తెలిపాడు. నంబర్ 1 ర్యాంక్ సాధించడమంటే హిమాలయ శిఖరాన్ని తాకడమేనని.. తాను జస్ప్రీత్కు వీరాభిమానినని స్టార్ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బూమ్‌బాల్ ముందు ఏదీ పనికిరాదని.. బజ్‌బాల్‌కు సరైన విరుగుడు అదేనన్నాడు. బుమ్రా బౌలింగ్‌తో పాటు యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేసిన తీరునూ అశ్విన్ మెచ్చుకున్నాడు. ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న బ్యాటర్లా అతడు ఆడాడని కొనియాడాడు.
గిల్ టాలెంట్ మీద ఎలాంటి సందేహం లేదని.. సెంచరీల మీద సెంచరీలు కొట్టే సత్తా అతడికి ఉందన్నాడు అశ్విన్. కాగా, ఈ వెటరన్ స్పిన్నర్ 500 వికెట్ల క్లబ్లో చేరేందుకు దగ్గర్లో ఉన్నాడు. ఇంకో వికెట్ తీస్తే టెస్టుల్లో ఐదొందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకుంటాడు. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టులో ఈ మైల్‌స్టోన్‌ను అతడు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక, సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయంతో బాధపడుతున్న స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. కొత్తగా ఆకాశ్ దీప్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి.. బజ్‌బాల్‌కు బూమ్‌బాల్ సరైన విరుగుడు అని అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SA20 2024: వీడియో: రెండోసారి ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్!
Ashwin said “The real show stealer is Boomball, he bowled extraordinarily – leading wicket taker of the series & also the number 1 ranked bowler. I am a huge fan of his & this is a Himalayan feat”. [Ashwin YT] pic.twitter.com/yIIfUr2vbu
— Johns. (@CricCrazyJohns) February 10, 2024