Nidhan
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. అతడు వేసిన ఓ స్టన్నింగ్ డెలివరీతో స్టోక్స్‌కు మతిపోయింది.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. అతడు వేసిన ఓ స్టన్నింగ్ డెలివరీతో స్టోక్స్‌కు మతిపోయింది.
Nidhan
టీమిండియాను సొంతగడ్డ మీద ఓడించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. బంతి గింగిరాలు తిరిగే ఇక్కడి టర్నింగ్ ట్రాక్స్ మీద పరుగులు చేయడం అంత ఈజీ కాదు. దిగ్గజ బ్యాటర్లే మన బౌలర్ల చేతుల్లో ఔట్ అయి తోకముడిచారు. భారత్‌ను ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన టాప్ టీమ్స్ దారుణ పరాజయాలను ఫేస్ చేయక తప్పలేదు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి వచ్చినా ఇక్కడ ఓటములు తప్పవు. అది ఇంగ్లండ్‌కు ఇప్పుడు అర్థమవుతోంది. బజ్‌బాల్ క్రికెట్‌తో రోహిత్ సేనను ఓడిస్తామంటూ బడాయికి పోయిన ఇంగ్లీష్ టీమ్‌కు తొలి టెస్ట్‌లో చుక్కలు కనిపిస్తున్నాయి. మన బౌలర్ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అయింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియక బిత్తరపోయాడు. స్టార్ స్పిన్నర్ అశ్విన్ అతడికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చాడు.
టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వలలో పడి విలవిల్లాడాడు స్టోక్స్. సెకండ్ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టాడు స్టోక్స్ (6). ఒకవైపు ఓలీ పోప్ (77 నాటౌట్) క్రీజులో పాతుకుపోయడు. కానీ ఆ టీమ్ కెప్టెన్‌కు మాత్రం ఈ పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం కాలేదు. బాల్ బాగా రివర్స్ స్వింగ్ అవుతుండటం, మంచి బౌన్స్‌తో పాటు స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుండటంతో స్టోక్స్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 6 పరుగులే చేసి అశ్విన్ వేసిన ఓ ఆఫ్ స్పిన్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మిడిల్ స్టంప్ లైన్లో అశ్విన్ వేసిన బాల్ టర్న్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. బాల్‌ను డిఫెన్స్ చేసేందుకు స్టోక్స్ ప్రయత్నించాడు. కానీ టర్న్ అయిన బాల్ అతడి బ్యాట్‌ను బీట్ చేసి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను ముద్దాడింది. బంతిని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించినా మూమెంట్ కాస్త స్లోగా ఉండటంతో పడిన వెంటనే టర్న్ అయిన బాల్ అతడి బ్యాట్‌ను దాటి స్టంప్స్‌కు తాకింది. దీంతో బిత్తరపోయిన స్టోక్స్ అశ్విన్ వైపు చూస్తూ ఇదేం బాల్ అనుకుంటూ క్రీజును వీడాడు. అయితే స్టార్ స్పిన్నర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఔట్ అవడం ఇదే తొలిసారి కాదు. మొత్తంగా టెస్ట్ క్రికెట్లో 12 సార్లు స్టోక్స్‌ను ఔట్ చేశాడు అశ్విన్. అతడి పాలిట విలన్లా తయారయ్యాడు. ఈ రికార్డు గురించి తెలియడం, స్టోక్స్ లెఫ్టాండర్ బ్యాటర్ కావడంతో అతడు బ్యాటింగ్‌కు రాగానే అశ్విన్‌ను దింపాడు రోహిత్. అది బాగా పనిచేసి బ్రేక్ త్రూ లభించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్లకు 196 రన్స్‌తో ఉంది. ఆ జట్టు 7 రన్స్ లీడ్‌తో ఉంది. పోప్ (82 నాటౌట్), బెన్ ఫోక్స్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. స్టోక్స్ పాలిట అశ్విన్ విలన్‌గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin for the 12th time in Test cricket history has Ben Stokes. 🐐pic.twitter.com/Snj4LCkrjd
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2024