Nidhan
రాజ్‌కోట్ టెస్టులో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు.
రాజ్‌కోట్ టెస్టులో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు.
Nidhan
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఫ్యామిలీలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అశ్విన్ హఠాత్తుగా చెన్నైకి పయనమయ్యాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అశ్విన్‌కు బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ అండగా ఉంటాయని.. అతడికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. అశ్విన్ వైదొలగడంతో మూడో టెస్టులో భారత్ 4 బౌలర్లతోనే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకునే డెసిషన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
అశ్విన్ వెళ్లిపోవడంతో ఇప్పుడు భారత జట్టులో నలుగురు బౌలర్లే మిగిలారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌తో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా టీమ్‌లో ఉన్నారు. అయితే ఐదో బౌలర్ లేకుండా కొనసాగడం చాలా కష్టం. ఉన్న నలుగురు బౌలర్లతో అన్ని ఓవర్లు పూర్తి చేయించడం అంత ఈజీ కాదు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల అలసిపోవడమే గాక గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదో బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే రూల్స్ ప్రకారం దీనికి ఇంగ్లండ్ సారథి స్టోక్స్ ఒప్పుకోవాలి. అశ్విన్ ప్లేసులో ఇంకో ప్లేయర్‌ను తీసుకునేందుకు స్టోక్స్ ఓకే అంటే భారత్ కష్టాలు తీరుతాయి. దీంతో ఇప్పుడు అంతా ఇంగ్లీష్ టీమ్ చేతుల్లో ఉంది. ఆ టీమ్ మేనేజ్మెంట్, స్టోక్స్ తీసుకునే నిర్ణయం మీదే మ్యాచ్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆధారపడి ఉంది.
ఒకవేళ స్టోక్స్ ఒప్పుకుంటే అశ్విన్‌కు బదులుగా భారత టీమ్‌లోకి ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో ఆడిన అక్షర్ పటేల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ రీప్లేస్‌మెంట్‌కు రెడీగా ఉన్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే టీమ్‌లోకి వస్తారు. మొదటి రెండు మ్యాచుల్లో ఆడటం, టెస్టుల్లో మంచి అనుభవం ఉండటం, ఫామ్‌లో కూడా ఉండటంతో అక్షర్ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా స్టోక్స్ ఒప్పుకుంటేనే జరుగుతుంది. భారత రిక్వెస్ట్‌ను అతడు తిరస్కరిస్తే ఉన్న నలుగురు బౌలర్లతోనే కంటిన్యూ కావాల్సి ఉంటుంది. రీప్లేస్‌మెంట్‌కు ఒప్పుకోకపోయినా సబ్‌స్టిట్యూట్‌గా ఒక ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోవచ్చు. అయితే సబ్‌స్టిట్యూట్ ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం అవుతాడు. మరి.. అశ్విన్ రీప్లేస్‌మెంట్‌కు స్టోక్స్ ఒప్పుకుంటాడని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్, నగలు చోరీ
If Ben Stokes agrees, India can replace Ravichandran Ashwin with either of Washington Sundar or Axar Patel. pic.twitter.com/BLi9TrMA69
— CricketGully (@thecricketgully) February 17, 2024
🚨NEWS ALERT🚨
India will be playing with 10 players + 1 substitute from Day 3 in the Rajkot Test.#cricket #India pic.twitter.com/wJZxoqApT8
— InsideSport (@InsideSportIND) February 16, 2024