Nidhan
భారత జట్టు వరుసగా సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. ఆ పవర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారత జట్టు వరుసగా సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. ఆ పవర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
భారత క్రికెట్ జట్టు ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గతేడాది ఆసియా కప్ నుంచి మొదలుకొని ఆ తర్వాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్-2023, ఆసీస్‌తో టీ20 సిరీస్.. అలాగే సౌతాఫ్రికా టూర్, రీసెంట్గా ఆఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ వరకు మన టీమ్ పట్టిందల్లా బంగారమే అయింది. ఒక్క ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిని మినహాయిస్తే మిగిలిన ఏ సిరీస్‌లోనూ, టోర్నీలోనూ భారత్‌కు ఎదురే లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ రోహిత్ సేన ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో మన టీమ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇలా గత కొంత కాలంగా భారత్ సాధిస్తున్న విజయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. అయితే జట్టును వెనుక ఉండి నడిపిస్తున్నాడో అన్సంగ్ హీరో. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియాకు చాలా మంది అన్సంగ్ హీరోలు ఉన్నారు. అందులో మొదటగా రాజీవ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. అతడ్ని అందరూ రాజీవ్ భాయ్ అని పిలుస్తారు. ఆయన మన జట్టుకు మజిల్ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లో గానీ లేదా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గానీ ప్లేయర్లు గాయపడితే వారికి ట్రీట్మెంట్ అందించి ఫిట్‌గా ఉంచడం ఆయన పని. బౌలర్లు, బ్యాటర్లకు కండరాలు త్వరగా పట్టేస్తుంటాయి. ఎంత ఫిట్‌గా ఉన్న ఆటగాడికైనా ఎక్కువ సేపు బౌలింగ్ వేస్తే లేదా క్రీజులో అధిక సమయం గడిపితే కండరాలు పట్టేస్తాయి. అలాంటప్పుడు మ్యాచ్‌లో కంటిన్యూ అవడం కష్టం. ఈ టైమ్‌లో రంగంలోకి దిగుతారు రాజీవ్. సపోర్ట్ స్టాఫ్‌తో కలసి ఆటగాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తారు. మజిల్స్‌ను ఫ్రీ చేసి ప్లేయర్లను మళ్లీ గ్రౌండ్లోకి దింపుతారు. అతడి కృషి వల్లే భారత ఫాస్ట్ బౌలర్లు, బ్యాటర్లు వేగంగా కోలుకొని మైదానంలో తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు. కానీ ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇలా భారత జట్టు కోసం అహర్నిషలు కృషి చేస్తున్నా రాజీవ్‌లా వెలుగులోకి రాని మరికొంత మంది అన్సంగ్ హీరోలు ఉన్నారు.
టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ సోహమ్ దేశాయ్, ఎస్ రజినీకాంత్, హరి ప్రసాద్ మోహన్, రిషికేష్ ఉపాధ్యాయ, అరుణ్ కనడే, రాఘవేంద్ర ద్విగి, నువాన్ సెనివిరత్నే గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వీరిలో సోహామ్ దేశాయ్ స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా ఉన్నారు. ఆటగాళ్ల ఇంజ్యురీలు, ఫిట్నెస్ మొదలైనవి ఈయన పర్యవేక్షిస్తారు. గాయాల బారిన పడిన భారత క్రికెటర్లు తిరిగి టీమ్‌లోకి వచ్చే వరకు వాళ్ల రీహాబిలిటేషన్‌ను ఎస్ రజినీకాంత్ చూసుకుంటారు. ప్రతి మ్యాచ్ వీడియోలను, డేటాను అనాలసిస్ చేసే బాధ్యతలను హరి ప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. మన జట్టుకు ఈయనే వీడియో అండ్ డేటా అనలిస్ట్.
భారత టీమ్‌కు లాజిస్టిక్స్ మేనేజర్‌గా ఉన్నారు రిషికేష్ ఉపాధ్యాయ. ప్రయాణ టికెట్లు, సామాగ్రి, యూనిఫామ్స్‌తో పాటు క్రికెటర్ల ఫ్యామిలీస్‌కు కావాల్సిన ఏర్పాట్లను ఈయనే దగ్గర ఉండి చూసుకుంటారు. ఆటగాళ్ల ఫిట్నెస్ను చూసుకోవడానికి అనురన్ కనడే రూపంలో మరో వ్యక్తి టీమ్‌తో జర్నీ చేస్తున్నారు. ఇక, బ్యాటర్లకు ప్రాక్టీస్ కోసం త్రోడౌన్ ఎక్స్‌పర్ట్‌గా ఉండి సేవలు అందిస్తున్నారు రాఘవేంద్ర ద్విగి. మన టీమ్‌తో శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఆయనే నువాన్ సెనివిరత్నే. స్పిన్నర్ అయిన నువాన్.. భారత బ్యాటర్లకు లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొనే సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరి.. భారత్ విజయాల వెనుక దాగిన అన్సంగ్ హీరోల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: దాదా, ధోని, కోహ్లీ రికార్డ్స్ గల్లంతు! టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ కొత్త చరిత్ర..
Rajeev Kumar – The Unsung Hero of Indian Cricket 🫡#IndianCricket #BCCI #RajeevKumar #CricketTwitter pic.twitter.com/WrOtO8Bx4l
— InsideSport (@InsideSportIND) February 19, 2024