Nidhan
టీమిండియా పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుందని మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. రోహిత్, కోహ్లీ కాదు.. రివేంజ్ తీర్చడం అతడికే సాధ్యం అవుతుందని చెప్పాడు.
టీమిండియా పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుందని మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. రోహిత్, కోహ్లీ కాదు.. రివేంజ్ తీర్చడం అతడికే సాధ్యం అవుతుందని చెప్పాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో అసలైన పోరుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఫైనల్ బెర్త్ కోసం భారత్-ఇంగ్లండ్ మధ్య భీకర యుద్ధం జరగనుంది. బట్లర్ సేనకు ఇది మరో సెమీస్ మాత్రమే. కానీ టీమిండియాకు అలా కాదు. అరంగేట్ర టీ20 ప్రపంచ కప్ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో మెన్ ఇన్ బ్లూ విజేతగా నిలవలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సెమీస్ లేదా ఫైనల్స్ వరకు వచ్చి ఆగిపోయింది. 2022 సెమీస్‌లోనూ ఇదే జరిగింది. అయితే ఆ ఏడాది నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్ చేతుల్లో ఓటమిపాలైంది భారత్. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటకు రావడానికి క్రికెటర్లకు చాలా సమయం పట్టింది. అయితే ఆ అవమానానికి బదులు తీర్చుకోవడానికి ఇప్పుడు టైమ్ వచ్చింది.
అదే ఇంగ్లండ్ టీమ్‌తో మళ్లీ వరల్డ్ కప్ సెమీస్‌లో తలపడుతోంది టీమిండియా. కాబట్టి ఆ జట్టుపై రివేంజ్ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదు. అన్ని అస్త్రాలను బయటకు తీసి బట్లర్ సేనను చిత్తు చేయాలి. అప్పుడు ఫైనల్ బెర్త్ దక్కడంతో పాటు పగ కూడా చల్లారుతుంది. భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ను ఓడించి తీరాలని అన్నాడు. అయితే ఆ జట్టుపై రివేంజ్ తీరాలంటే అది విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వల్ల కాదన్నాడు. అందుకు కరెక్ట్ ప్లేయర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతుల్లో భారత్ ఓడిందని.. అయితే ఆ మ్యాచ్‌లో కుల్దీప్ ఆడలేదన్నాడు చావ్లా.
టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లో కుల్దీప్ లేకపోవడం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు చావ్లా. అతడు ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదన్నాడు. రివేంజ్ తీర్చుకోవడానికి టీమిండియాకు ఇదే సరైన సమయమని చెప్పాడు. ఇప్పుడు కుల్దీప్ భీకర ఫామ్‌లో ఉన్నాడని.. ఇంగ్లీష్ టీమ్‌తో నాకౌట్ ఫైట్‌లో అతడు చాలా కీలకమని పేర్కొన్నాడు చావ్లా. ‘ఇంజ్యురీ తర్వాత కుల్దీప్ యాదవ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతం. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతడికి ఎదురేలేదు. 2022 ప్రపంచ కప్ సెమీస్‌లో అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు బిగ్ మైనస్‌గా మారింది. కానీ ఈసారి కుల్దీప్ టీమ్‌లో ఉన్నాడు. సెమీస్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని చావ్లా వ్యాఖ్యానించాడు. నాకౌట్ ఫైట్‌లో కుల్దీప్ చాలా ఎఫెక్టివ్‌గా మారతాడని.. అతడు ఎలా బౌలింగ్ చేస్తాడనేది భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుందన్నాడు. మరి.. టీమిండియా పగ తీర్చేది కుల్దీపే అంటూ చావ్లా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Piyush Chawla ” Kuldeep Yadav has one of the greatest comebacks. His absence in the 2022 semi final was a significant miss for India,but this time, he is in his prime form and ready to make a substantial impact.”pic.twitter.com/ZLpwelss2k
— Sujeet Suman (@sujeetsuman1991) June 27, 2024