Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్న హిట్‌మ్యాన్.. సెమీస్‌లోనూ జోరు చూపించాలని అనుకుంటున్నాడు. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ మాత్రం తమకు రోహిత్‌తో కాదు.. అతడితోనే భయమని అంటున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్న హిట్‌మ్యాన్.. సెమీస్‌లోనూ జోరు చూపించాలని అనుకుంటున్నాడు. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ మాత్రం తమకు రోహిత్‌తో కాదు.. అతడితోనే భయమని అంటున్నాడు.
Nidhan
టీమిండియా అసలైన సవాల్‌కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన రోహిత్ సేన.. దర్జాగా సెమీస్ గడప తొక్కింది. కీలక పోరులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి నాకౌట్ ఫైట్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. బట్లర్ సేనను ఓడిస్తే ఫైనల్ టికెట్ ఖాయం అవుతుంది. అందుకే ఆ టీమ్‌ను చిత్తు చేయడానికి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతోంది. సెమీస్‌కు ముందు అన్ని ఆయుధాలను బయటకు తీస్తున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. భీకర ఫామ్‌లో ఉన్న అతడు.. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్నాడు. సెమీస్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇంగ్లీష్ టీమ్ మాత్రం హిట్‌మ్యాన్ అంటే తమకు అంత భయం లేదని అంటోంది.
రోహిత్ కంటే భారత జట్టులో అతడే మరింత డేంజరస్ బ్యాటర్ అని అంటున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. అతడు క్రీజులో కుదురుకుంటే తమ పని ఫినిష్ అని టెన్షన్ పడుతున్నాడు. ఇంగ్లీష్ ప్లేయర్లను అంతగా భయపెడుతున్న ఆ బ్యాటర్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ. ఐసీసీ టోర్నీల్లో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ ఇప్పుడు పూర్ ఫామ్‌తో బాధపడుతున్నాడు. హయ్యెస్ట్ రన్ స్కోరర్స్ లిస్ట్‌లో ఎప్పుడూ పైన ఉండే ఈ టాప్ బ్యాటర్.. ఇప్పుడు ఎక్కడో అట్టడుగున ఉన్నాడు. అయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రం కోహ్లీ అంటే తమకు భయమని చెబుతున్నారు. విరాట్ ఆటతీరును ఎన్నో ఏళ్లుగా గమనిస్తూ వస్తున్నానని, అతడి లాంటి కాంపిటీటర్ ఇంకొకరు లేరన్నాడు బట్లర్.
ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో కోహ్లీ ఆడుతుంటాడని, ఆటపై అతడి నిబద్ధత అద్భుతమని మెచ్చుకున్నాడు బట్లర్. అతడు డేంజరస్ బ్యాటర్ అని చెప్పాడు. విరాట్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదని.. తనదైన రోజున ఆటను ప్రత్యర్థి జట్టు నుంచి లాగేసుకోవడం కింగ్ స్పెషాలిటీ అని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని ఆ టీమ్ బ్యాటర్ విల్ జాక్స్ పేర్కొన్నాడు. బరిలోకి దిగితే 150 పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడని, ఓటమి ఒప్పుకోకపోవడం విరాట్ తత్వమని జాక్స్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు ఇంతలా హైప్ ఇస్తున్న కోహ్లీ గనుక సెమీస్‌లో ఫామ్‌లోకి వచ్చాడా ఆ టీమ్‌కు దబిడిదిబిడే. భారత ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన విరాట్.. టచ్‌లోకి వచ్చేందుకు ఇంతకంటే మంచి తరుణం లేదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ సెమీస్‌లో రాణిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
England players about Virat Kohli. [Star Sports]
Buttler said “Watching him over the years, playing against him, fierce competitive drive and determination to be the best”.
Archer said “On his day, he takes the game away from you”.
Will Jacks said “He is a nice guy, he gives… pic.twitter.com/ECoIZUwBf1
— Johns. (@CricCrazyJohns) June 26, 2024