iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: బుమ్రా కిల్లింగ్ డెలివరీ.. స్టోక్స్​ రియాక్షన్ వైరల్!

  • Published Feb 03, 2024 | 4:46 PM Updated Updated Feb 03, 2024 | 4:46 PM

రెండో టెస్టులో ఇంగ్లండ్ బెండు తీస్తోంది భారత్. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

రెండో టెస్టులో ఇంగ్లండ్ బెండు తీస్తోంది భారత్. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

  • Published Feb 03, 2024 | 4:46 PMUpdated Feb 03, 2024 | 4:46 PM
IND vs ENG: వీడియో: బుమ్రా కిల్లింగ్ డెలివరీ.. స్టోక్స్​ రియాక్షన్ వైరల్!

రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్​లో ఆధిక్యం సాధిద్దామనుకున్న ఇంగ్లండ్​కు భారత్ చుక్కలు చూపిస్తోంది. వైజాగ్ టెస్టులో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్ టీమ్​కు మంచి ఆరంభం దొరికింది. జాక్ క్రాలే (76), బెన్ డకెట్ (21) కలసి ఫస్ట్ వికెట్​కు 59 రన్స్ జోడించారు. అయితే ఆ తర్వాత ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేదు. ఓలీ పాప్ (23), జానీ బెయిర్​స్టో (25)లు మంచి స్టార్ట్ దొరికినా యూజ్ చేసుకోలేకపోయారు. ఒకవైపు పేసర్ జస్​ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను పోయించగా.. మరోవైపు కుల్దీప్ స్పిన్ మ్యాజిక్​తో వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్​ బెన్ స్టోక్స్​ను ఓ కిల్లింగ్ డెలివరీతో పెవిలియన్​కు పంపాడు బుమ్రా.

అప్పటికే 6 వికెట్లు పడటంతో జోరు పెంచిన బెన్ స్టోక్స్ (47) ఎడాపెడా షాట్లు కొట్టాడు. అటాకింగ్ గేమ్​తో భారత్​పై ఒత్తిడి పెంచాడు. దీంతో రోహిత్ వర్మ తెలివిగా బుమ్రాను రంగంలోకి దించాడు. ఫస్ట్ టెస్టులో స్టోక్స్​ను అద్భుతమైన బంతితో జస్​ప్రీత్ బౌల్డ్ చేశాడు. అందుకే మళ్లీ అతడి చేతికే బాల్ ఇచ్చాడు హిట్​మ్యాన్. అతడి నమ్మకం వృథా కాలేదు. బుమ్రా వేసిన బాల్ ఆఫ్​ స్టంప్ అవతల పడి తక్కువ ఎత్తులో బౌన్స్ అయి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. ఆలస్యంగా షాట్ ఆడిన స్టోక్స్​ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. అతడి బ్యాట్​ను బీట్ చేసిన బాల్​ ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది. దీంతో స్టోక్స్​ షాకయ్యాడు. ఇలా బౌలింగ్ చేస్తే ఎలా ఆడాలంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఎలా ఔట్ అయ్యాడో అర్థం కాక బ్యాట్ కింద పడేసి బుమ్రా వైపు చేతులు చూపించాడు. దీంతో జస్​ప్రీత్ సెలబ్రేషన్స్​లో మునిగిపోయాడు. స్టోక్స్​ కంటే ముందు రూట్, పాప్, బెయిర్​స్టోను ఇలాగే ఫెంటాస్టిక్ డెలివరీస్​తో వెనక్కి పంపాడు. మరి.. ఈ మ్యాచ్​లో బుమ్రా బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.