iDreamPost
android-app
ios-app

IND vs ENG: KS భరత్​పై కోపాన్ని ఇంగ్లండ్ బ్యాటర్ మీద చూపించిన బుమ్రా!

  • Published Jan 27, 2024 | 1:42 PM Updated Updated Jan 27, 2024 | 1:43 PM

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. కానీ ఇంగ్లండ్​తో​ జరుగుతున్న తొలి టెస్ట్​లో బుమ్రా సీరియస్ అయ్యాడు. కీపర్ కేఎస్ భరత్​పై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. కానీ ఇంగ్లండ్​తో​ జరుగుతున్న తొలి టెస్ట్​లో బుమ్రా సీరియస్ అయ్యాడు. కీపర్ కేఎస్ భరత్​పై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.

  • Published Jan 27, 2024 | 1:42 PMUpdated Jan 27, 2024 | 1:43 PM
IND vs ENG: KS భరత్​పై కోపాన్ని ఇంగ్లండ్ బ్యాటర్ మీద చూపించిన బుమ్రా!

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్​గా ఉంటాడు. గ్రౌండ్​లోనే కాదు బయట కూడా అలాగే అదే యాటిట్యూడ్​ను మెయింటెయిన్ చేస్తాడు. తోటి ప్లేయర్లు అందరితో కలసిపోయి జోవియల్​గా ఉండే బుమ్రా ఫస్ట్ టైమ్ సీరియస్​గా కనిపించాడు. ఇంగ్లండ్​తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్​లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేసిన ఓ పనితో పేసుగుర్రం సీరియస్ అయ్యాడు. అయితే ఆ కోపంతో రెచ్చిపోయిన బుమ్రా.. ఇంగ్లండ్ బ్యాట్స్​మన్​కు చుక్కలు చూపించాడు. బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు. దెబ్బకు క్రీజును వీడాడు ఇంగ్లీష్​ బ్యాటర్. ఇది ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్​లో జరిగింది. ఆ ఓవర్​లో బెన్​ డకెట్​ను పర్ఫెక్ట్​గా సెట్ చేశాడు బుమ్రా. అప్పటికే వరుస బౌండరీలతో భారత్​ను భయపెట్టిన డకెట్​ను ఓ అద్భుతమైన ఇన్​స్వింగర్​తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు.

డకెట్ ప్లంబ్ అయినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూకు వెళ్దామని బుమ్రా అనుకున్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ కీపర్ కేఎస్ భరత్ వైపు చూశాడు. ఎల్బీడబ్ల్యూనా? కాదా? రివ్యూకు వెళ్దామా అని అతడ్ని అడిగాడు. అయితే డీఆర్ఎస్ వద్దని భరత్ చెప్పడంతో హిట్​మ్యాన్ ఆగిపోయాడు. కానీ రీప్లేలో డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు తేలింది. దీంతో బుమ్రా కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కానీ తన అగ్రెషన్​ను భరత్ మీద కాకుండా డకెట్ మీద చూపించాడు. ఆ ఓవర్​లో మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసిన పేసుగుర్రం ఈసారి ఇంగ్లండ్ బ్యాటర్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫోర్త్ స్టంప్ మీద పడిన బంతి ఇన్ స్వింగ్ అయి డకెట్ ఆఫ్ వికెట్​ను గిరాటేసింది. బుమ్రా వేసిన స్పీడ్​కు వికెట్ ఎగిరి చాలా దూరంగా పడింది. దీంతో డకెట్ షాకయ్యాడు. ఇదేం బాల్​.. ఇంత స్వింగ్ ఎలా అయిందని ఆశ్చర్యపోయాడు. ఆ వికెట్​ను సెలబ్రేట్ చేసుకుంటూ తన కోపాన్ని చూపించిన బుమ్రా అక్కడితో ఆగలేదు.

bumrah superb bowling

డకెట్​ను ఔట్ చేశానన్న కాన్ఫిడెన్స్​తో నెక్స్ట్ ఓవర్​లో మరింత అగ్రెసివ్​గా బౌలింగ్ చేశాడు బుమ్రా. దీనికి ఫలితం కూడా వచ్చింది. పర్ఫెక్ట్ సెటప్​తో ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్​ను ఔట్ చేశాడు. అతడ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈసారి కూడా ఇన్​స్వింగ్ అస్త్రంతోనే వికెట్ పడగొట్టాడు బుమ్రా. మూడో రోజు లంచ్ నుంచి బాల్ రివర్స్ స్వింగ్ అవడం స్టార్ట్ అయింది. దీంతో బుమ్రాతో పాటు మరో పేసర్ మహ్మద్ సిరాజ్​ను కూడా బౌలింగ్​కు దింపాడు రోహిత్ శర్మ. ఒక ఎండ్​లో సిరాజ్ పరుగులు ఆపుతుంటే మరో ఎండ్​లో బుమ్రా వికెట్లు తీస్తున్నాడు. దీంతో ఇంగ్లండ్​ బ్యాట్స్​మెన్​కు ఎలా ఆడాలో తెలియడం లేదు. బాల్ రివర్స్ స్వింగ్ అవుతుండటంతో ఇంగ్లండ్ ఈ రోజే ఆలౌట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఆ జట్టు 24.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఉంది. జానీ బెయిర్​స్టో (4 నాటౌట్), ఓలీ పోప్ (36 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్​ స్కోరుకు ఇంకా 66 పరుగుల దూరంలో ఉంది. మరి.. బుమ్రా బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.