Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును భారత స్టార్ బ్రేక్ చేశాడు.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును భారత స్టార్ బ్రేక్ చేశాడు.
Nidhan
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (51 నాటౌట్), రోహిత్ శర్మ (14) కలసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. మంచి స్టార్ట్ దొరకడంతో టీమ్‌కు ఢోకా లేదనుకుంటున్న సమయంలో రోహిత్ ఔటయ్యాడు. అరంగేట్ర బౌలర్, 20 ఏళ్ల షోయబ్ బషీర్ హిట్‌మ్యాన్‌ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ (34) బాగానే ఆడినా అండర్సన్ అతడ్ని పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం జైస్వాల్‌తో పాటు శ్రేయస్ అయర్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 103. పిచ్ నుంచి పేస్‌కు మద్దతు లభిస్తుండటంతో అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక, టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ బౌలర్లు గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్‌ను అధిగమించాడు. అతడు సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత స్పీడ్‌స్టర్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. గత 40 ఏళ్లలో బెస్ట్ బౌలింగ్ యావరేజ్ కలిగిన పేసర్ల లిస్టులో జస్ప్రీత్ టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. 21.68 యావరేజ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ (21.76), సౌతాఫ్రికా దిగ్గజం అలెన్ డొనాల్డ్ (22.04) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. నాలుగో ప్లేసులో విండీస్ వీరుడు మాల్కమ్ మార్షల్ (22.86), ఐదో ప్లేసులో సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్ (23.37) నిలిచారు. ఈ లిస్టులో మెక్‌గ్రాత్‌తో పాటు పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ (23.53) టాప్‌లో ఉంటారని అంతా ఊహించారు. కానీ వాళ్లిద్దర్నీ బుమ్రా దాటేశాడు. మెక్‌గ్రాత్ రెండో స్థానంలో ఉండగా.. అక్రమ్ ఏడో స్థానంలో ఉన్నాడు. కనీసం 300 వికెట్లు తీసిన పేసర్ల యావరేజ్‌లను తీసుకొని ఈ లిస్టును తయారు చేశారు.
బెస్ట్ యావరేజ్ కలిగిన బౌలర్ల జాబితాలో బుమ్రాతో పాటు మరో భారత బౌలర్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతడే సీనియర్ పేసర్ మహ్మద్ షమి. 26.06 సగటుతో 17వ స్థానంలో నిలిచాడు షమి. ఈ లిస్టులో ఎక్కువగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ బౌలర్లదే డామినేషన్ నడిచింది. అయితే మహామహా బౌలర్లను దాటి బుమ్రా ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకోవడం విశేషం. ఇది చూసిన టీమిండియా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. బుమ్రా కష్టానికి, అతడు పెట్టిన ఎఫర్ట్‌కు దక్కిన గౌరవం ఇది అని అంటున్నారు. ఫ్యూచర్లో అతడు భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని.. ఇలాంటి ఘనతలు ఇంకా చాలా అందుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, బుమ్రా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను గెలిపించాలని పట్టుదలతో ఉన్నాడు. మరి.. బెస్ట్ బౌలింగ్ యావరేజ్లో మెక్‌గ్రాత్‌ను దాటి బుమ్రా ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐉𝐚𝐬𝐩𝐫𝐢𝐭 𝐁𝐮𝐦𝐫𝐚𝐡 𝐨𝐰𝐧𝐬 𝐭𝐡𝐞 𝐬𝐭𝐫𝐞𝐞𝐭𝐬! 🌟#JaspritBumrah #Cricket #INDvENG #Test #Sportskeeda pic.twitter.com/nbkutG0v7W
— Sportskeeda (@Sportskeeda) February 1, 2024