iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: కెప్టెన్సీపై బుమ్రా షాకింగ్ కామెంట్స్.. ఆ ఛాన్స్ వస్తే మాత్రం..!

  • Published Jan 23, 2024 | 4:12 PM Updated Updated Jan 23, 2024 | 4:12 PM

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్​ యూనిట్​ను అంతా తానై లీడ్ చేస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ప్రధాన బౌలర్​గా కొనసాగుతున్న బుమ్రా.. కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్​ యూనిట్​ను అంతా తానై లీడ్ చేస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ప్రధాన బౌలర్​గా కొనసాగుతున్న బుమ్రా.. కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jan 23, 2024 | 4:12 PMUpdated Jan 23, 2024 | 4:12 PM
Jasprit Bumrah: కెప్టెన్సీపై బుమ్రా షాకింగ్ కామెంట్స్.. ఆ ఛాన్స్ వస్తే మాత్రం..!

ఇంగ్లండ్​తో ఐదు టెస్టుల సిరీస్​కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​కు క్వాలిఫై అవ్వాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్​ను పట్టేయాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. అందుకే ఎవరి ప్లానింగ్​లో వాళ్లు బిజీ అయిపోయారు. తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ ప్లేయర్లు కఠోర సాధనలో మునిగిపోయారు. స్వదేశంలో సక్సెస్ అయిన బజ్​బాల్​ ఫార్ములానే టీమిండియా మీద కూడా ప్రయోగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే పేస్​, స్వింగ్​కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్​ల మీద అది వర్కౌట్ అయింది. కానీ టర్నింగ్ ట్రాక్స్​కు పుట్టినిల్లు అయిన ఇండియాలో బజ్​బాల్ ఫార్ములా విజయవంతమవడం కష్టమే. అయితే ఆ బజ్​బాల్ ఫార్ములానే తమకు కలిసొస్తుందని భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా అన్నాడు. బజ్​బాల్ ఫార్ములాతో పాటు కెప్టెన్సీ మీదా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అటాకింగ్ అప్రోచ్ వల్ల ఇంగ్లండ్ బ్యాటర్లు తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బుమ్రా తెలిపాడు. బజ్​బాల్ గురించి తాను పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. ‘దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లీష్ బ్యాటర్లు తప్పులు చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు బజ్​బాల్​ ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు మరో మార్గం ఉందని వరల్డ్ క్రికెట్​కు వాళ్లు దూకుడు చూపిస్తున్నారు. అయితే ఈ ఫార్ములా బౌలర్​గా నాకు కలిసొస్తుందని భావిస్తున్నా. వికెట్లు తీసేందుకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. సిచ్యువేషన్​ను నాకు తగ్గట్లుగా మార్చుకోవడం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తా. నాకు కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం. ఒకసారి జట్టుకు సారథ్యం కూడా వహించా. ఆ మ్యాచ్​లో మేం ఓడాం.. కానీ ఆ టెస్ట్​లో చాలా మటుకు మా డామినేషన్ నడిచింది’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

టెస్టు క్రికెట్ ఆడటమే గొప్ప అని.. అలాంటిది లాంగ్ ఫార్మాట్​లో జట్టును కెప్టెన్​గా లీడ్ చేయడాన్ని మించిన గౌరవం ఏం ఉంటుందని బుమ్రా ప్రశ్నించాడు. తాను ఓ మ్యాచ్​లో టీమిండియాకు సారథిగా ఉన్నానని.. ఓడిపోయినా ఆ టెస్టులో ఆధిపత్యం చూపించామన్నాడు. తనకు బాధ్యతలు తీసుకోవడం అంటే చాలా ఇష్టమన్నాడు. ‘నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఇష్టం. కానీ ఫాస్ట్ బౌలర్ కాబట్టి బౌలింగ్ వేసి ఫైన్​ లెగ్​లో ఫీల్డింగ్​కు వెళ్లిపోవాలి. నాకు మాత్రం మ్యాచ్​లో పూర్తిగా భాగమవ్వాలని ఉంటుంది. ప్రతి నిర్ణయంలోనూ నా పాత్ర ఉండాలనే ఆశ ఉంది. ఒకవేళ కెప్టెన్​గా టీమ్​ను ముందుండి నడిపించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను’ అని బుమ్రా స్పష్టం చేశాడు. ఈ టీమిండియా పేసర్ మాటల్ని బట్టి చూస్తే రోహిత్ తర్వాత కెప్టెన్సీకి అతడు రేసులో ఉన్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. హిట్​మ్యాన్ తర్వాత బుమ్రా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మరి.. కెప్టెన్సీపై బుమ్రా చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.