iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: మూడో టెస్టుకు బుమ్రా దూరం! గెలిపించినోడ్ని పక్కన పెడుతున్నారు..

  • Published Feb 05, 2024 | 8:31 PM Updated Updated Feb 05, 2024 | 8:31 PM

వైజాగ్ టెస్టులో అద్భుతమైన బౌలింగ్​తో టీమిండియా గెలుపులో జస్​ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. అలాంటోడ్ని మూడో టెస్టుకు పక్కన పెడుతున్నారు.

వైజాగ్ టెస్టులో అద్భుతమైన బౌలింగ్​తో టీమిండియా గెలుపులో జస్​ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. అలాంటోడ్ని మూడో టెస్టుకు పక్కన పెడుతున్నారు.

  • Published Feb 05, 2024 | 8:31 PMUpdated Feb 05, 2024 | 8:31 PM
Jasprit Bumrah: మూడో టెస్టుకు బుమ్రా దూరం! గెలిపించినోడ్ని పక్కన పెడుతున్నారు..

వైజాగ్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్​ను చిత్తుగా ఓడించింది. బజ్​బాల్​ క్రికెట్​తో కాసేపు ప్రత్యర్థి జట్టు కంగారుపెట్టినా.. ఆ టీమ్​ను మన బౌలర్లు మడతపెట్టారు. స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్​కు తోడుగా మిగతా బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్​కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్​లో బజ్​బాల్​ బెండు తీయడంలో, మ్యాచ్​ను భారత్ వైపు తిప్పడంలో కీలకపాత్ర పోషించింది బుమ్రానే. యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్ భారీ ఇన్నింగ్స్​లతో అదరగొట్టారు. వాళ్ల కాంట్రిబ్యూషన్​ను కాదనడానికి లేదు. కానీ బజ్​బాల్​తో భయపెట్టిన ఇంగ్లండ్​ను భారీ స్కోర్లు చేయకుండా.. టార్గెట్​ చేరుకోలేమనే భయాన్ని పుట్టించి పడగొట్టింది మాత్రం బుమ్రానే. మ్యాచ్ మొత్తం మీద 9 వికెట్లు తీసిన ఏస్ పేసర్.. ఇంగ్లీష్ బ్యాటర్లను ఓ రేంజ్​లో పోయించాడు. అయితే అలాంటోడ్ని మూడో టెస్టుకు దూరం పెట్టనున్నారని తెలుస్తోంది.

రెండో టెస్టులో రోహిత్ సేన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్​కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో పేసుగుర్రానికి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆఖరి రెండు టెస్టుల్లో మరింత ఉత్సాహంగా ఉండేందుకు టీమ్ మేనేజ్​మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే దీని మీద జట్టు నుంచి గానీ బీసీసీఐ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మూడో టెస్టులో బుమ్రాను పక్కన పెట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి భారత జట్టు ప్రకటనపై మరింత ఆసక్తి నెలకొంది. ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతడి ప్లేసులో ఎవర్ని ఆడిస్తారో చూడాలి. మొదటి టెస్టులో ఆడిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్​ను జస్​ప్రీత్ ప్లేసులో దింపుతారా? లేదా కొత్తగా మరో బౌలర్​ను స్క్వాడ్​లోకి తీసుకొస్తారా అనేది చూడాలి.

కాగా, విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టుకు భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హాజరయ్యారు. ఆట నాలుగో రోజు ఆయన గ్రౌండ్​కు వచ్చారు. మ్యాచ్ అయిపోయాక కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి అగార్కర్ మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో హిట్​మ్యాన్ టీమ్ ప్లేయర్ల వైపు తన చేతి వేలిని చూపిస్తూ ఏదో సీరియస్​గా చెప్పాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సిరీస్​లోని మిగిలిన మూడు టెస్టులకు సంబంధించి జట్టు ప్రకటన రేపు ఉండనుంది. టీమ్ అనౌన్స్​మెంట్ విషయంలో ఇంకో ప్లేయర్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న కింగ్.. సిరీస్​లోని మిగిలిన మ్యాచుల్లోనైనా ఆడతాడా? లేదా సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడా? అనేది జట్టు ప్రకటన తర్వాతే క్లారిటీ రానుంది. మరి.. బుమ్రాను మూడో టెస్టులో ఆడించాలా? వద్దా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.