Nidhan
వైజాగ్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‌కు ఓ రేంజ్లో పోయిస్తున్నారు. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది.
వైజాగ్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‌కు ఓ రేంజ్లో పోయిస్తున్నారు. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది.
Nidhan
వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ఒక రేంజ్లో పోయిస్తున్నారు. అటాకింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అతడి కెరీర్లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. టెయిలెండర్లలో రవిచంద్రన్ అశ్విన్ (20) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా బ్యాట్లెత్తేయడంతో 400 పరుగులకు నాలుగు పరుగుల దూరంలో భారత ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్‌కు మంచి స్టార్ట్ దొరికింది. కానీ ఆ తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి టెస్టులో భారీ సెంచరీతో మ్యాచ్‌ను తారుమారు చేసిన ఓలీ పాప్ (23) కూడా ఔటవ్వడంతో రోహిత్ సేనకు పెద్ద గండం తప్పింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసిన జాక్ క్రాలే (76), బెన్ డకెట్ (21) ఫస్ట్ వికెట్‌కు 59 పరుగులు జోడించారు. అయితే కుల్దీప్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పోప్, క్రాలే కలసి స్కోరు బోర్డును 100 పరుగులు దాటించారు. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న క్రాలేను అక్షర్ పెవిలియన్‌కు చేర్చాడు. అతడు వేసిన బాల్‌ను భారీ షాట్ కొడదామనుకున్నాడు క్రాలే. కానీ బాల్ గాల్లోకి లేవడంతో అయ్యర్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత జో రూట్ (5)ను ఔట్ చేసిన బుమ్రా.. కొద్ది గ్యాప్‌లోనే పాప్‌ను కూడా ఔట్ చేశాడు. ఓ అద్భుతమైన బంతితో తొలి టెస్టు హీరో పాప్‌ను జీరోను చేశాడు జస్ప్రీత్.
బుమ్రా వేసిన డెడ్లీ యార్కర్‌కు పాప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్లో తొలి 4 బంతుల్ని నార్మల్‌గా వేసి మంచి సెటప్ చేసిన బుమ్రా.. ఐదో బాల్‌గా యార్కర్ వేశాడు. బుల్లెట్ స్పీడ్‌తో దూసుకొచ్చిన ఆ బాల్‌కు పాప్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఓపెనర్లతో పాటు కీలకమైన రూట్, ప్రమాదకర పాప్ కూడా క్రీజును వీడటంతో భారత్‌కు పెద్ద గండం తప్పింది. ఇలాగే దూకుడుగా బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్‌ను 250 పరుగుల్లోపే ఆలౌట్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్ టీమ్ 32.3 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులతో ఉంది. జానీ బెయిర్‌స్టో (23 నాటౌట్)తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. రెండో టెస్టులో భారత బౌలర్ల ప్రదర్శనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Yashasvi Jaiswal: పిట్ట కొంచెం కూత ఘనం! 22 ఏళ్లకే రికార్డుల రారాజుగా జైస్వాల్!
BUMRAH IS A FREAK…!!! 🤯 pic.twitter.com/Nhi8R0iGHq
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2024