Nidhan
క్రికెట్లో లెజెండరీ బౌలర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు జేమ్స్ అండర్సన్. అతడు సంధించే బంతుల్ని టచ్ చేయాలన్నా బ్యాటర్లు భయపడతారు. అలాంటోడు తనకు ఆ భారత దిగ్గజమే స్ఫూర్తి అంటున్నాడు.
క్రికెట్లో లెజెండరీ బౌలర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు జేమ్స్ అండర్సన్. అతడు సంధించే బంతుల్ని టచ్ చేయాలన్నా బ్యాటర్లు భయపడతారు. అలాంటోడు తనకు ఆ భారత దిగ్గజమే స్ఫూర్తి అంటున్నాడు.
Nidhan
జేమ్స్ అండర్సన్.. ఈ పేరు వింటేనే ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుడుతుంది. 21 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్, టెస్టుల్లో 698 వికెట్లు.. ఇది చాలదు అండర్సన్ ఎంత గ్రేటో చెప్పేందుకు. క్రికెట్లో ఎందరు పేసర్లు ఉన్నా అందరి కంటే అండర్సన్ డిఫరెంట్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో అతడు వేసే స్వింగింగ్ డెలివరీస్‌ను ఎదుర్కోవాలంటే టాప్ బ్యాటర్స్ కూడా భయపడతారు. షాట్లు కొట్టడం పక్కనపెడితే కనీసం బాల్‌ను టచ్ చేయాలన్నా వెనుకంజ వేస్తారు. టచ్ చేస్తే ఎక్కడ స్లిప్‌లో క్యాచ్‌కు వెళ్తుందోననేది వాళ్ల భయం. ఆ రీతిలో అండర్సన్ బౌలింగ్ ఉంటుంది. అందుకే 41 ఏళ్లకు వయసు పైబడినా ఇంకా ఇంగ్లండ్ టీమ్‌లో ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తా చాటుతున్న అండర్సన్.. ఆ టీమిండియా లెజెండే తనకు ఇన్స్పిరేషన్ అని అంటున్నాడు. అతడ్ని చూసే తాను బౌలింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు.
‘ఈ మధ్య కాలంలో టీమిండియా పేస్ అటాక్ ఎంతో మెరుగుపడింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇలాంటి టాప్ నాచ్ పేసర్స్ ఈ జనరేషన్లో చాలా అరుదు. వీళ్లు ముగ్గురూ వరల్డ్ క్లాస్ బౌలర్స్. ఈ లిస్టులో ఇషాంత్ శర్మను కూడా చేర్చొచ్చు. నా మటుకైతే జహీర్ ఖాన్ చాలా స్పెషల్ అని చెబుతా. అతడి బౌలింగ్‌ను చూసి నేను ఎంతో నేర్చుకున్నా. రివర్స్ స్వింగ్ ఎలా చేయాలి? బౌలింగ్‌కు వచ్చేటప్పుడు బాల్‌ను ఎలా కవర్ చేయాలి? లాంటివి అతడి నుంచే నేర్చుకున్నా’ అని అండర్సన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా బౌలింగ్ వేసిన తీరుకు తానేమీ షాక్ అవ్వలేదని తెలిపాడు. కచ్చితమైన పేస్, ఒకే చోట నిలకడగా బంతులు వేయడం, బాల్‌ను ఇరు వైపులా స్వింగ్ చేయడం అతడి బలమని అండర్సన్ పేర్కొన్నాడు.
ప్రస్తుత సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తలపడే ఛాన్స్ రాకపోవడంతో నిరాశగా ఉందన్నాడు అండర్సన్. కోహ్లీ లాంటి బెస్ట్ ప్లేయర్‌తో పోటీ పడాలని.. అలాంటి వాళ్లను ఔట్ చేయాలని ప్రతి బౌలర్ కోరుకుంటాడని వ్యాఖ్యానించాడు. గత కొన్నేళ్లలో తామిద్దరం పలుమార్లు తలపడ్డామని తెలిపాడు. ప్రపంచ బ్యాటర్లలో కోహ్లీనే బెస్ట్ అని మెచ్చుకున్నాడు అండర్సన్. అతడు టాప్ క్వాలిటీ బ్యాటర్ అని.. అతడు ఈ సిరీస్‌లో ఆడకపోవడంతో ఇంగ్లీష్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారని చెప్పుకొచ్చాడు. విరాట్ ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనన్నాడు. కానీ కోహ్లీతో తలపడాలని తాను అనుకున్నానని.. అలాంటోడితో ఆడితేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుందన్నాడు అండర్సన్. విరాట్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. మరి.. జహీర్, కోహ్లీ గురించి అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
James Anderson said “Zaheer Khan was someone I used to watch a lot to try & learn from – how he used the reverse swing, how he covered the ball – that is something I tried to sort of develop on the back of playing against him”. [JioCinema] pic.twitter.com/MlEZHH21SY
— Johns. (@CricCrazyJohns) February 28, 2024
ఇదీ చదవండి: అఫీషియల్! సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్, శ్రేయస్ అయ్యర్ ఔట్