Nidhan
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో ఇప్పటిదాకా ఏ పేస్ బౌలర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో ఇప్పటిదాకా ఏ పేస్ బౌలర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు.
Nidhan
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా వరల్డ్ క్రికెట్లో ఏ బౌలర్ కూడా సాధించని ఓ రేర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. మొత్తం 187 టెస్టుల్లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడంతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు అండర్సన్. ఓవరాల్‌గా 700 వికెట్ల క్లబ్లో చేరిన మూడో బౌలర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. ఈ లిస్టులో అండర్సన్ కంటే మరో ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), ఆస్ట్రేలియా గ్రేట్ షేన్ వార్న్ (708 వికెట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇందులో మురళీధరన్‌ను అందుకోవడం కష్టమే. కానీ మరో 9 వికెట్లు తీస్తే ఆసీస్ లెజెండ్ వార్న్‌ను అండర్సన్ అధిగమిస్తాడు. ఇప్పుడు ఉన్న ఫిట్నెస్తో మరో మూడ్నాలుగేళ్లు ఆడితే మురళీధరన్ రికార్డును బ్రేక్ చేసి మోస్ట్ వికెట్ టేకర్‌గా అవతరించే ఛాన్సులు ఉన్నాయి. ఇక, ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, టామ్ హార్ట్లీకి చెరో 2 వికెట్లు దక్కగా.. స్పిన్నర్ బషీర్ 5 వికెట్లు తీశాడు. మరి.. అండర్సన్ అరుదైన రికార్డుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కుల్దీప్ పై కాసుల వర్షం.. ఒక్కో వికెట్ కు రూ. లక్ష! ఎందుకంటే?
JAMES ANDERSON COMPLETED 700 WICKETS IN TEST…!!!! 🫡
– One of the greatest moment in cricket history. pic.twitter.com/7mOu9LzMjo
— Johns. (@CricCrazyJohns) March 9, 2024