Nidhan
భారత జట్టు ఇప్పుడో కొత్త సెంటిమెంట్‌ను పాటిస్తోంది. ఇది టీమ్‌కు చాలా మంచి చేస్తోంది. విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సంప్రదాయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారత జట్టు ఇప్పుడో కొత్త సెంటిమెంట్‌ను పాటిస్తోంది. ఇది టీమ్‌కు చాలా మంచి చేస్తోంది. విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సంప్రదాయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు అదరగొడుతోంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ టీమ్‌కు మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11)లు ఫస్ట్ వికెట్‌కు 47 పరుగులు జోడించారు. మంచి ఆరంభం దొరకడంతో ఇద్దరూ భారీ స్కోర్లు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ ప్రత్యర్థి జట్టును మడత బెట్టేశాడు. డకెట్‌తో పాటు ఓలీ పోప్ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. మరో 10 పరుగుల గ్యాప్‌లో క్రాలేను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆ టీమ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీసిన ఆకాశ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే భారత జట్టు పాటిస్తున్న ఓ కొత్త సెంటిమెంట్ ఆకాశ్ సక్సెస్‌కు హెల్ప్ చేసిందని చెప్పొచ్చు.
ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ నేషనల్ టీమ్‌కు ఆడే ఛాన్స్ రాదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తమ కుటుంబాలు కూడా దగ్గరగా ఉంటే బాగుంటుందని ఏ ప్లేయిర్ అయినా కోరుకుంటాడు. అందుకే దీన్ని గమనించిన భారత టీమ్ మేనేజ్మెంట్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ల ఫ్యామిలీలను మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో రాజ్‌కోట్ టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు టెస్ట్ క్యాప్ ఇచ్చారు. క్యాప్ అందుకోగానే అతడు తన తండ్రి, భార్యను కలసి ఎమోషనల్ అయ్యాడు. వాళ్లు మ్యాచ్‌ను గ్రౌండ్లో కూర్చొని వీక్షిస్తుండగా.. రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ దీప్ తనకు టెస్ట్ క్యాప్ ఇవ్వగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత బరిలోకి దిగి ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు.
అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ల కుటంబాలను గ్రౌండ్లోకి ఆహ్వానించడం ఇప్పుడు రోహిత్ సేనకు సెంటిమెంట్‌గా మారింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో పలువురు యంగ్‌స్టర్స్ డెబ్యూ ఇచ్చారు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆకాశ్ దీప్ రూపంలో ఒకే సిరీస్‌లో నలుగురు కుర్రాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిలో రజత్ వైజాగ్ టెస్ట్‌లో అరంగేట్రం చేయగా.. రాజ్‌కోట్ టెస్ట్ సర్ఫరాజ్, జురెల్‌కు డెబ్యూ మ్యాచ్‌గా మారింది. ఇప్పుడు రాంచీ టెస్టులో ఆకాశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇలా ఒకే టెస్టులో ఇంత మంది యంగ్‌స్టర్స్ అరంగేట్రం జరగలేదు. దీనికి సెలక్టర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను మెచ్చుకోవాల్సిందే. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్న కుర్రాళ్లకు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడాన్ని ప్రశంసించాల్సిందే.
కాగా, డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లు తమ సంతోషాన్ని ఫ్యామిలీతో కలసి సెలబ్రేట్ చేసుకునేలా టీమ్ మేనేజ్మెంట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయమని.. మిగతా టీమ్స్ కూడా దీన్ని ఫాలో అవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ఇచ్చిన తర్వాత అతడి పేరెంట్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ కలసి ధైర్యం ఇవ్వడాన్ని గుర్తుచేస్తున్నారు. సర్ఫరాజ్‌కు తాను ఉన్నానని.. భరోసా ఇవ్వడం సూపర్బ్ అంటున్నారు. రాంచీ టెస్టులోనూ ఆకాశ్‌కు మిగిలిన ప్లేయర్లు మద్దతుగా ఉండటం, 3 వికెట్లు తీసిన తర్వాత బ్రేక్ టైమ్‌లో టీమ్‌ను లీడ్ చేసే ఛాన్స్ అతడికి ఇవ్వడం సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ వల్లే ప్లేయర్లు మరింత కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగి రాణిస్తున్నారని చెబుతున్నారు. మరి.. భారత జట్టు కొత్త సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆకాశ్ దీప్ సక్సెస్ వెనుక కోహ్లీ.. అప్పుడు పడిన కష్టం వల్లే..!
Family!❤️ pic.twitter.com/3fm68tJiNd
— CricketGully (@thecricketgully) February 23, 2024
AKASH DEEP ON FIRE. 🔥🤯
– One of the finest debut ever in Tests by an Indian fast bowler…!!!!pic.twitter.com/WeKIUWxlyL
— Johns. (@CricCrazyJohns) February 23, 2024