Nidhan
విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్సవుతోందని ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడు ఉండి ఉంటే వారి కళ్లలో కళ్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవాడని చెప్పాడు.
విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్సవుతోందని ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడు ఉండి ఉంటే వారి కళ్లలో కళ్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవాడని చెప్పాడు.
Nidhan
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు నిండా స్టార్లు ఉన్నా అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. బజ్‌బాల్‌తో కొట్టేస్తామంటూ బడాయికి పోయిన ఇంగ్లీష్ టీమ్‌కు చుక్కలు చూపిస్తారని అనుకుంటే వారి ముందు తలొగ్గడాన్ని భరించలేకపోతున్నారు. వైజాగ్‌లో జరిగే రెండో టెస్టులో దీనికి రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. అతడు ఉండి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదని అన్నాడు. విరాట్ ఉండి ఉంటే వారి కళ్లలోకి కళ్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవాడని చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి పనేసార్ ఇంకా ఏమేం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
‘విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్సవుతోంది. ఒకవేళ అతడు గనుక ఫస్ట్ టెస్ట్‌లో ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇంగ్లండ్ క్రికెటర్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ వార్నింగ్ ఇచ్చేవాడు. రండి.. ఆడండి, మీరెంత తోపులో చూపెట్టండని ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించేవాడు. మళ్లీ ఇక్కడ గెలిచి చూపించండి అంటూ వాళ్లను రెచ్చగొట్టేవాడు’ అని పనేసార్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ లేకపోవడంతో భారత జట్టులో తీవ్రత, ఫైర్ లోపించిందన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్ ఓటమికి అస్సలు భయపడదని.. వాళ్ల బలం కూడా అదేనన్నాడు. ఓడిపోతామనే భయం లేకుండా ఆడటాన్ని వాళ్లు అలవాటు చేసుకున్నారని తెలిపాడు. ఒకవేళ ఓడిపోయినా దాన్ని వాళ్లు లెక్కచేయరని పేర్కొన్నాడు. రాబోయే నాలుగు టెస్టుల్లోనూ ఇంగ్లీష్ టీమ్ ఇదే విధంగా భయపడకుండా ఆడుతుందని స్పష్టం చేశాడు పనేసార్.
ఉప్పల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిలయ్యాడని పనేసార్ చెప్పాడు. ఇంగ్లండ్ స్వేచ్ఛగా ఆడకుండా అడ్డుకోలేకపోయాడని.. అపోజిషన్ టీమ్‌పై ఒత్తిడి పెట్టడంలో అతడు విఫలమయ్యాడని వ్యాఖ్యానించాడు. మొదటి టెస్టులో గెలవడంతో ఈ సిరీస్‌ను పట్టేస్తామనే ధీమా ఇంగ్లండ్‌లో ఏర్పడిందని తెలిపాడు. కోహ్లీ ఉండి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదన్నాడు. ‘కోహ్లీ జట్టులో ఉంటే ఆ ఇంటెన్సిటీ బయటకు కనిపిస్తుంది. ప్రస్తుత టీమిండియాలో అదే మిస్సవుతోంది. విరాట్ లేని లోటు పూడ్చలేనిది. ఒకవేళ సెకండ్ టెస్ట్‌లో కూడా ఇంగ్లండ్ నెగ్గితే అప్పుడు భారత్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఇది రోహిత్ శర్మకు బిగ్ ఛాలెంజ్. కోహ్లీ లేకపోయినా టీమ్‌ను గెలిపించగలనని.. మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పగలనని అతడు ప్రూవ్ చేయాలి’ అని పనేసార్ స్పష్టం చేశాడు. ఇక, వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మూడో టెస్టులోనైనా అతడు అందుబాటులోకి వస్తాడేమో చూడాలి. మరి.. కోహ్లీ ఉండి ఉంటే ఇంగ్లండ్‌కు వార్నింగ్ ఇచ్చేవాడంటూ పనేసార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Monty Panesar said, “Virat Kohli presence and intensity is missing. If Virat was playing the 1st test, he would be in the faces of England players. He would tell them, come on do it again let’s see how good you are”. pic.twitter.com/yjOEi6f4Kv
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024