Nidhan
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఆల్రౌంట్ పెర్ఫార్మెన్స్తో పర్యాటక జట్టుపై వన్‌సైడ్ విక్టరీ కొట్టింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఆల్రౌంట్ పెర్ఫార్మెన్స్తో పర్యాటక జట్టుపై వన్‌సైడ్ విక్టరీ కొట్టింది.
Nidhan
ఏ టీమ్ ఎదురొచ్చినా, ఏ దేశంలోనైనా బజ్‌బాల్ అంటూ బ్యాట్‌తో, బాల్‌తో చెలరేగిపోయే ఇంగ్లండ్ పప్పులు ఇండియాలో ఉడకడం లేదు. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులను భయపెట్టే ఇంగ్లీష్ టీమ్.. రోహిత్ సేన దెబ్బకు బిక్కచచ్చిపోయింది. మన కుర్రాళ్లు సిక్సర్ల మోత మోగించిన పిచ్ మీద.. ఎంతో అనుభవం ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లు బ్యాట్లు ఎత్తేశారు. దీంతో ఆ టీమ్‌కు ఘోర పరాభవం మిగిలింది. భారత్ నిర్దేశించిన 556 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పర్యాటక జట్టు కేవలం 39.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల పరంగా టీమిండియాకు టెస్టుల్లో ఇదే అతి పెద్ద విజయం. అయితే ఈ మ్యాచ్‌లో మరో హైలైట్ అంటే కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ కీపింగ్ అనే చెప్పాలి. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతూ లెజెండ్ ఎంఎస్ ధోనీని అతడు గుర్తుచేశాడు.
కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న జురెల్ అద్భుతమైన కీపింగ్‌తో ధోనీని తలపించాడు. వికెట్ల వెనుక పాదరసంలా కదులుతూ ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్లీని స్టంపౌట్ చేసిన ధృవ్.. రెండో ఇన్నింగ్స్‌లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. రాజ్‌కోట్ పిచ్‌పై బాల్ ఎక్కువ టర్న్ కాకపోయినా.. వికెట్ మీద అంత పేస్ లేకపోయినా ఒక్కోసారి బంతి అనూహ్యంగా బౌన్స్ అవడం లేదా తక్కువ ఎత్తులో నుంచి దూసుకురావడం జరిగింది. ఇది పేసర్లతో పాటు ఎక్కువగా జడేజా వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో చోటుచేసుకుంది. దీంతో జురెల్ మరింత కాన్సంట్రేషన్తో కీపింగ్ చేశాడు. ఈ క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (4)ను అద్భుతంగా రనౌట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ వేసిన త్రోను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు ధృవ్.
సిరాజ్ వేసిన త్రోను పరిగెత్తుకుంటూ వచ్చి అందుకొని.. మోకాళ్లపై కూర్చొని బాడీని బ్యాలెన్స్ చేయకుండానే వికెట్లను గిరాటేశాడు జురెల్. చాలా అనుభవం ఉన్న కీపర్లకు కూడా సాధ్యం కానిది అతడు అలవోకగా చేసేశాడు. క్రీజులోకి వచ్చేలోపు రనౌట్ చేసేయడంతో డకెట్ బిత్తరపోయాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ (15) బ్యాట్‌కు ఎడ్జ్ తగిలి వచ్చిన లో క్యాచ్‌ను అంతే క్విక్ హ్యాండ్స్‌తో అందుకున్నాడు ధృవ్. బాల్ వేగాన్ని, ఎడ్జ్‌ను సరిగ్గా అంచనా వేసి పట్టుకున్నాడు. క్లిష్టమైన రనౌట్‌తో పాటు అంతే డిఫికల్ట్ క్యాచ్‌ను అందుకున్న జురెల్.. వికెట్ల వెనుక చాలా పరుగులు కాపాడాడు.
బుమ్రా, సిరాజ్ స్టంప్స్‌కు దూరంగా వేసిన కొన్ని బాల్స్ బౌండరీలకు వెళ్లేవి. కానీ అతడు డైవ్ చేసి వాటిని ఆపాడు. తద్వారా ఎక్స్ట్రా రన్స్ లీక్ కాకుండా చూసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ వచ్చే వరకు భారత్‌కు ఢోకా లేదని.. జురెల్ రూపంలో మరో సూపర్ కీపర్, బ్యాటర్ దొరికాడని అందరూ మెచ్చుకుంటున్నారు. కేఎస్ భరత్‌ను ఇక పక్కన పెడతారని.. జురెల్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు అతడికి చోటు దొరకడం కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోని వారసుడు జట్టులోకి వచ్చాడని.. ఇక, నో టెన్షన్ అని చెబుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ ఛాన్స్ దక్కించుకున్న జురెల్ 46 పరుగులు చేశాడు. అశ్విన్‌తో కలసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. మరి.. జురెల్ కీపింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: ఆ డేర్ చేసిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ! ఇంగ్లండ్ అహంపై కొట్టాడు!
WHAT A RUN-OUT BY DHRUV JUREL.
– Incredible Stuff by Dhruv..!!! 🔥 pic.twitter.com/iWJDYiZVEk
— CricketMAN2 (@ImTanujSingh) February 18, 2024