Dhruv Jurel: ఇండియాని గెలిపించిన ధృవ్ జురెల్ కథ! నాడు అమ్మ బంగారం తాకట్టు పెట్టి!

ఇంగ్లండ్​తో జరిగిన నాలుగో టెస్టులో ధృవ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి ధృవ్ జురెల్ కృషి, కుటుంబ నేపథ్యం, అతని ప్రయాణం వైరల్ అవుతోంది.

ఇంగ్లండ్​తో జరిగిన నాలుగో టెస్టులో ధృవ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి ధృవ్ జురెల్ కృషి, కుటుంబ నేపథ్యం, అతని ప్రయాణం వైరల్ అవుతోంది.

క్రికెట్​లో అత్యున్నత దశకు చేరుకోవడం అంత ఈజీ కాదు. క్లబ్ లెవల్ నుంచి డొమెస్టిక్ క్రికెట్ వరకు రావడం చాలా గొప్పగా భావిస్తారు. ఇంక నేషనల్ టీమ్​కు కూడా అవకాశం లభిస్తే దానికి మించిన అదృష్టం మరొకటి ఉండదు. అయితే క్లబ్ స్థాయి నుంచి నేషనల్ టీమ్ వరకు రావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకోసం భారీ డబ్బు కూడా ఖర్చవుతుంది. అయితే కేవలం టాలెంట్​తోనే ఈ స్థాయికి చేరుకునే ఆటగాళ్లు కూడా కొందరు ఉన్నారు. అలా భారత జట్టులోకి దూసుకొచ్చాడో వికెట్ కీపర్, బ్యాట్స్​మన్. అతడి పేరే ధృవ్ జురెల్. ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టుతో ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడతను. ఇప్పుడు నాలుగో టెస్టులో కూడా అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులతో అజేయంగా నలిచి.. ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. అయితే జురెల్ నాన్న నేమ్ సింగ్ గురించి తెలిస్తే గూస్​బంప్స్ రావాల్సిందే.

ధృవ్ జురెల్ తండ్రి ఓ సైనికుడు కావడం గమనార్హం. అంతేకాదు పాకిస్థాన్​తో జరిగిన కార్గిల్ వార్​లో ఆయన పాల్గొన్నారు. ఆ యుద్ధంలో పాకిస్థాన్​ను ఓడించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాంటి సైనికుడు నేమ్ సింగ్ కొడుకు జురెల్ ఇవాళ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్​ను దక్కించుకున్నాడు. హవళ్దార్​గా ఇండియన్ ఆర్మీకి చాన్నాళ్ల పాటు సేవలు అందించారు నేమ్ సింగ్. అయితే జురెల్ క్రికెట్ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. కెరీర్​ మొదట్లో కిట్​కు డబ్బులు చాలకపోవడంతో అతడి తల్లి ఇంట్లోని బంగారాన్ని అమ్మేశారు. వచ్చిన డబ్బులతో కిట్​ను కొనిచ్చి.. బాగా ఆడాలని ప్రోత్సహించారు. ఇలా జురెల్ కోసం అతడి ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసింది. ఆఖరికి కొడుకు ఇండియాకు ఆడటంతో వాళ్ల కల నెరవేరింది.

జురెల్ స్టోరీ తెలుసుకున్న భారత అభిమానులు అతడికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సాధారణ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి నేషనల్ టీమ్​కు సెలక్ట్ అవడం అంత ఈజీ కాదంటున్నారు. కార్గిల్ వార్​లో గెలిపించిన అతడి తండ్రికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. జురెల్ కూడా బ్యాటింగ్, కీపింగ్​లో దుమ్మురేపి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. జురెల్​కు ఆ సత్తా ఉందని.. అతడు పక్కాగా రాణిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 15 మ్యాచులు ఆడిన జురెల్.. 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో మొత్తంగా 790 పరుగులు చేశాడు. అలాగే 2 స్టంపింగ్స్, 34 క్యాచులు కూడా తన అకౌంట్​లో వేసుకున్నాడు. నాగులో టెస్టులో అతని ప్రదర్శన చూసిన తర్వాత టీమిండియాకి మరో ధోనీ కాబోతున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తండ్రి సైనికుడు, కొడుకు క్రికెటర్.. ఈ స్టోరీ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Glenn Phillips: వీడియో: ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యాచ్‌ చూసి ఉండరు!

Show comments