Nidhan
టీమిండియా నయా వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు పుజారా. ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. అయినా అతడికి మాత్రం న్యాయం జరగడం లేదు.
టీమిండియా నయా వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు పుజారా. ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. అయినా అతడికి మాత్రం న్యాయం జరగడం లేదు.
Nidhan
టీమిండియా వెటరన్ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అడ్డుగోడలా నిలబడిపోయిన పుజారా ఏకంగా సెంచరీతో రాణించడమే కాకుండా జట్టును కూడా ఆదుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా శతకంతో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర స్కోరు బోర్డు మీద నలభై పరుగులు చేరేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. షెల్డన్ జాక్సన్ (78 నాటౌట్)తో కలసి 168 పరుగుల భారీ భాగస్యామ్యం నెలకొల్పాడు. దీంతో ఆ టీమ్ 242 పరుగులతో తొలి రోజును ముగించింది. మూడు వికెట్లు త్వరత్వరగా పడిన టైమ్‌లో పుజారా గనుక ఔట్ అయ్యుంటే సౌరాష్ట్ర మరింత కష్టాల్లో పడేది. అయితే ఇంతగా రాణిస్తున్నా అతడ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
భారత జట్టులో చోటు కోల్పోయిన పుజారా ఆందోళనకు గురికాలేదు. తన బ్యాట్‌తోనే సెలక్టర్లకు సమాధానం ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు రంజీ ట్రోఫీ-2024ను వేదికగా చేసుకున్న నయా వాల్ సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అలాగే ఓ డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. కుదిరితే సెంచరీ లేకపోతే హాఫ్ సెంచరీ.. కానీ తగ్గేదేలే అన్నట్లు బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు పుజారా. సాలిడ్ డిఫెన్స్‌కు తోడుగా అటాక్ కూడా చేస్తూ అపోజిషన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మంచి స్ట్రయిక్ రేట్‌తో రన్స్ చేస్తూ తనలో పస ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్నాడు. టీమిండియా నుంచి తనను పక్కనపెట్టి తప్పు చేశారని వరుస సెంచరీలతో పుజారా చెప్పకనే చెబుతున్నాడు. అయినా సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టూర్‌తో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ మన బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. టాప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ వరకు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు.
శుబ్‌మన్ గిల్ రెండో టెస్టులో బాదిన సెంచరీని పక్కన పెడితే పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్లు ఎవరూ ఫామ్‌లో లేకపోయినా, తరచూ విఫలమవుతున్నా.. కంటిన్యూ చేస్తున్నారు గానీ పుజారాను తీసుకురావడం లేదు. వేలాది పరుగులు చేయడం, ఎంతో అనుభవం ఉన్న పుజారాను పూర్తిగా పక్కన పెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీపై ఆశతో ఉన్న పుజారా రంజీల్లో వరుస సెంచరీలు బాదినా పట్టించుకోవడం లేదు. అదే వన్డేల్లో మాత్రమే అదరగొడుతున్న గిల్‌కు మాత్రం ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నారు. స్పిన్, పేస్‌ను డిఫెన్స్ చేయడంలో.. స్ట్రయిక్ రొటేట్ చేయడంలో, ఒత్తిడిలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంలో పుజారాకు సాటి మరొక ప్లేయర్ లేడు. అయినా అతడ్ని మాత్రం దూరంగా పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకూ నయా వాల్‌ను దూరం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. పుజారాకు సెలక్టర్లు మొండిచెయ్యు చూపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విధ్వంసకర బ్యాటర్! చివరి మ్యాచ్ ఎప్పుడంటే?
HUNDRED FOR PUJARA….!!!!!
– 62nd FC hundred for the great man, dropped from the test team, fighting so hard in Ranji and smashed hundred against a very good bowling unit of Rajasthan when the team was struggling with 33 for 2. 🔥 pic.twitter.com/q5wkO5s59l
— Johns. (@CricCrazyJohns) February 9, 2024