iDreamPost
android-app
ios-app

Cheteshwar Pujara: సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న పుజారా! అయినా పట్టించుకోరా?

  • Published Feb 09, 2024 | 8:55 PM Updated Updated Feb 09, 2024 | 8:55 PM

టీమిండియా నయా వాల్​గా పేరు తెచ్చుకున్నాడు పుజారా. ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. అయినా అతడికి మాత్రం న్యాయం జరగడం లేదు.

టీమిండియా నయా వాల్​గా పేరు తెచ్చుకున్నాడు పుజారా. ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. అయినా అతడికి మాత్రం న్యాయం జరగడం లేదు.

  • Published Feb 09, 2024 | 8:55 PMUpdated Feb 09, 2024 | 8:55 PM
Cheteshwar Pujara: సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న పుజారా! అయినా పట్టించుకోరా?

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్ పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అడ్డుగోడలా నిలబడిపోయిన పుజారా ఏకంగా సెంచరీతో రాణించడమే కాకుండా జట్టును కూడా ఆదుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా శతకంతో విజృంభించాడు. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన సౌరాష్ట్ర స్కోరు బోర్డు మీద నలభై పరుగులు చేరేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్​కు వచ్చిన పుజారా ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. షెల్డన్ జాక్సన్ (78 నాటౌట్)తో కలసి 168 పరుగుల భారీ భాగస్యామ్యం నెలకొల్పాడు. దీంతో ఆ టీమ్ 242 పరుగులతో తొలి రోజును ముగించింది. మూడు వికెట్లు త్వరత్వరగా పడిన టైమ్​లో పుజారా గనుక ఔట్ అయ్యుంటే సౌరాష్ట్ర మరింత కష్టాల్లో పడేది. అయితే ఇంతగా రాణిస్తున్నా అతడ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

భారత జట్టులో చోటు కోల్పోయిన పుజారా ఆందోళనకు గురికాలేదు. తన బ్యాట్​తోనే సెలక్టర్లకు సమాధానం ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు రంజీ ట్రోఫీ-2024ను వేదికగా చేసుకున్న నయా వాల్ సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అలాగే ఓ డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. కుదిరితే సెంచరీ లేకపోతే హాఫ్​ సెంచరీ.. కానీ తగ్గేదేలే అన్నట్లు బ్యాట్​తో రెచ్చిపోతున్నాడు పుజారా. సాలిడ్ డిఫెన్స్​కు తోడుగా అటాక్ కూడా చేస్తూ అపోజిషన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మంచి స్ట్రయిక్ రేట్​తో రన్స్ చేస్తూ తనలో పస ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్నాడు. టీమిండియా నుంచి తనను పక్కనపెట్టి తప్పు చేశారని వరుస సెంచరీలతో పుజారా చెప్పకనే చెబుతున్నాడు. అయినా సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టూర్​తో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​లోనూ మన బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. టాప్​లో కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ వరకు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు.

శుబ్​మన్ గిల్ రెండో టెస్టులో బాదిన సెంచరీని పక్కన పెడితే పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్లు ఎవరూ ఫామ్​లో లేకపోయినా, తరచూ విఫలమవుతున్నా.. కంటిన్యూ చేస్తున్నారు గానీ పుజారాను తీసుకురావడం లేదు. వేలాది పరుగులు చేయడం, ఎంతో అనుభవం ఉన్న పుజారాను పూర్తిగా పక్కన పెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీపై ఆశతో ఉన్న పుజారా రంజీల్లో వరుస సెంచరీలు బాదినా పట్టించుకోవడం లేదు. అదే వన్డేల్లో మాత్రమే అదరగొడుతున్న గిల్​కు మాత్రం ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నారు. స్పిన్​, పేస్​ను డిఫెన్స్ చేయడంలో.. స్ట్రయిక్ రొటేట్ చేయడంలో, ఒత్తిడిలో ఇన్నింగ్స్​ను నిలబెట్టడంలో పుజారాకు సాటి మరొక ప్లేయర్ లేడు. అయినా అతడ్ని మాత్రం దూరంగా పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంగ్లండ్​తో చివరి మూడు టెస్టులకూ నయా వాల్​ను దూరం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. పుజారాకు సెలక్టర్లు మొండిచెయ్యు చూపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విధ్వంసకర బ్యాటర్‌! చివరి మ్యాచ్‌ ఎప్పుడంటే?