Nidhan
భారత్ చేతుల్లో వరుసగా రెండు టెస్టుల్లో ఓడటంతో ఇంగ్లండ్ నిరాశలో కూరుకుపోయింది. బజ్‌బాల్ ఫార్ములా వర్కౌట్ కాకపోవడంతో ఆ టీమ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
భారత్ చేతుల్లో వరుసగా రెండు టెస్టుల్లో ఓడటంతో ఇంగ్లండ్ నిరాశలో కూరుకుపోయింది. బజ్‌బాల్ ఫార్ములా వర్కౌట్ కాకపోవడంతో ఆ టీమ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Nidhan
భారత పర్యటనను పాజిటివ్‌గా స్టార్ట్ చేసిన ఇంగ్లండ్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. బజ్‌బాల్‌తో కొట్టేస్తామని, సిరీస్‌ను పట్టేస్తామని ముందు ప్రగల్భాలకు పోయారు ఇంగ్లీష్ క్రికెటర్లు. అందుకు తగ్గట్లే ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో నెగ్గడంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ అది మూడ్నాళ్ల ముచ్చటే అయింది. ఇంగ్లండ్‌కు అసలైన సవాల్ తర్వాతే మొదలైంది. బజ్‌బాల్ గుట్టు పట్టేసిన రోహిత్ సేన తర్వాతి రెండు టెస్టుల్లోనూ పర్యాటక టీమ్‌ను చిత్తుగా ఓడించింది. రాజ్‌కోట్ టెస్టులోనైతే టీమిండియా చేతిలో ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో ఓడింది ఇంగ్లండ్. దీంతో ఆ జట్టుపై భారీగా విమర్శలు వస్తున్నాయి. బజ్‌బాల్ ఫార్ములా ఫెయిలైందని.. ఇంకేదైనా ఉంటే ప్రయోగించాలని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
వరుసగా రెండు టెస్టుల్లో ఓడినా బజ్‌బాల్ క్రికెట్‌నే ఫాలో అవుతామని మెకల్లమ్ క్లారిటీ ఇచ్చాడు. ఎలాగైనా భారత్‌ను ఓడిస్తామని అన్నాడు. ‘జనాలు వాళ్లకు నచ్చినవి, తోచినవి చెబుతుంటారు. అవి మంచైనా, చెడైనా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పొచ్చు. అది వాళ్ల ఇష్టం. కానీ ఎవరేం చెప్పినా ఏది చేయాలో మేం అదే చేస్తాం. ఎవరి మాటైనా వినాలా? వద్దా? అనేది మా ఇష్టం. మా టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లు అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్ల అత్యుత్తమ ప్రతిభను బయట పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి బయట ఎవరో ఏదో చెబుతుంటే ఆ మాటల్ని డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకొస్తే అది మా సమస్యగా మారుతుంది. అందుకే మేం మా ప్లాన్స్‌కు తగ్గట్లు ముందుకెళ్తాం. ఈ సిరీస్‌లో మేం మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. 18 నెలల కిందటితో పోల్చుకుంటే ఇప్పుడు మాది మరింత బెటర్ టీమ్‌గా తయారైంది’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.
బజ్‌బాల్ ఫార్ములాకే కట్టుబడతామని మెకల్లమ్ స్పష్టం చేశాడు. ఒక్కోసారి మనం అనుకున్నట్లు ఫలితాలు రాకపోవచ్చని.. కానీ ఆ టైమ్‌లో కూడా ప్లానింగ్‌కు కట్టుబడే ఉండాలన్నాడు. క్లిష్టమైన దారిలో ప్రయాణించినప్పుడు ఒక్కోసారి ఓటములు ఎదురవుతాయని.. దీన్ని ఎదుర్కోవాల్సిందేనని ప్లేయర్లకు చెప్పానన్నాడు మెకల్లమ్. బజ్‌బాల్ వచ్చాక స్టార్ బ్యాటర్ జో రూట్ పదే పదే విఫలమవుతున్నాడనే విమర్శల మీదా ఇంగ్లండ్ కోచ్ రియాక్ట్ అయ్యాడు. ఈ ఫార్ములాకు గనుక రూట్ అలవాటు పడితే అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందన్నాడు. నార్మల్ రూట్ కావాలా? లేదా ఇంకా బెటర్‌గా ఆడే రూట్ కావాలా? అని మెకల్లమ్ ఎదురు ప్రశ్నించాడు. అతడిలో చాలా టాలెంట్ ఉందని.. బజ్‌బాల్‌ను సరిగ్గా అడాప్ట్ చేసుకుంటే సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందిస్తాడని పేర్కొన్నాడు. మరి.. బజ్‌బాల్ గురించి మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ టీమిండియా క్రికెటర్ అంటే నాకు చాలా ఇష్టం: విక్రాంత్ మాస్సే
Is ‘Bazball’ hampering Joe Root?
Brendon McCullum has addressed the issue. pic.twitter.com/r7HJ2lkuEa
— Test Match Special (@bbctms) February 19, 2024