iDreamPost

IND vs ENG: భారత్ చేతిలో ఓటమి.. బుమ్రాపై స్టోక్స్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 05, 2024 | 5:59 PMUpdated Feb 05, 2024 | 5:59 PM

వైజాగ్ టెస్టులో భారత్ చేతిలో ఓటమిని ఇంగ్లండ్ జీర్ణించుకోలేకపోతోంది. బజ్​బాల్​తో కొట్టేద్దామనుకుంటే ఇలా బెండు తీశారేంటని షాక్ అవుతోంది.

వైజాగ్ టెస్టులో భారత్ చేతిలో ఓటమిని ఇంగ్లండ్ జీర్ణించుకోలేకపోతోంది. బజ్​బాల్​తో కొట్టేద్దామనుకుంటే ఇలా బెండు తీశారేంటని షాక్ అవుతోంది.

  • Published Feb 05, 2024 | 5:59 PMUpdated Feb 05, 2024 | 5:59 PM
IND vs ENG: భారత్ చేతిలో ఓటమి.. బుమ్రాపై స్టోక్స్ షాకింగ్ కామెంట్స్!

ఇంగ్లండ్​ను చావుదెబ్బ తీసింది భారత్. ఉప్పల్ టెస్టులో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టులో 106 పరుగులు భారీ తేడాతో నెగ్గి సిరీస్​ను 1-1తో సమం చేసింది. టీమిండియా విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ టీమ్ 292 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్ జాక్ క్రాలే (73) ఒక్కడే హాఫ్ సెంచరీ కొట్టాడు. మిగిలిన వాళ్లకు మంచి స్టార్ట్స్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జస్​ప్రీత్ బుమ్రా తలో 3 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. వారికి ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సహకరించారు. వీళ్లంతా చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం పేసుగుర్రం బుమ్రాపై అపోజిషన్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బుమ్రా బౌలింగ్​కు వస్తున్నాడంటేనే తమకు తడిసిపోతోందని స్టోక్స్ తెలిపాడు. భారత్ విసిరిన టార్గెట్​ను ఈజీగా చేరుకుంటామని భావించామని అన్నాడు. ఇలాంటి ఛాలెంజ్​లను స్వీకరించడం తమకు కొత్త కాదన్నాడు. ఈ తరహా మ్యాచుల్లో ఇంతకుముందు చాలా సార్లు విజయాలు సాధించామని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి మ్యాచుల్లో రాణిస్తేనే ఆటగాళ్లలోని అసలైన సత్తా బయటపడుతుందన్నాడు. ఇదే మైండ్​సెట్​తో గత మ్యాచ్​లో టీమిండియాను ఓడించామని.. కానీ ఈ మ్యాచ్​లో ఆశించిన రిజల్ట్ రాలేదన్నాడు ఇంగ్లండ్ కెప్టెన్. బుమ్రా ఓ అసాధారణ బౌలర్ అని.. అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేనన్నాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే తమ విజయావకాశాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు స్టోక్స్.

బుమ్రా బౌలింగ్​కు వస్తే ఎంతటి బ్యాటర్​కైనా వణుకు పుట్టడం ఖాయమని స్టోక్స్ పేర్కొన్నాడు. అతడ్ని ప్రశంసించకుండా ఉండటం చాలా కష్టమన్నాడు. తమ టీమ్​లోని జేమ్స్ అండర్సన్ కూడా అసాధారణ బౌలర్ అని.. ఈ మ్యాచ్​లో అతడు మరోమారు తన సత్తా చూపించాడని మెచ్చుకున్నాడు. అండర్సన్​తో పాటు రెహాన్, హార్ట్​లీ, బషీర్ బాగా బౌలింగ్ చేశారని స్టోక్స్ వ్యాఖ్యానించాడు. విదేశాల్లో ఎలా ఆడాలనే దానిపై కెప్టెన్​గా ఎవరూ తనకు ఎలాంటి సూచనలు చేయలేదని ఇంగ్లండ్ సారథి వివరించాడు. భారత టూర్​ను టాస్క్​గా భావించామని.. తమకు అలవాటైన స్టైల్​లో ఆడుతూ పోతున్నామని తెలిపాడు. 330 పరుగుల లక్ష్యం ఉంటుందని ఊహించామని చెప్పుకొచ్చాడు. బుమ్రా వల్లే తాము గెలుపునకు దూరమయ్యామన్నాడు. మరి.. బుమ్రాపై స్టోక్స్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి