Nidhan
విశాఖపట్నంలో జరగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంలో ఎంఎస్ ధోనీని తాము ఫాలో అవుతున్నామని తెలిపాడు.
విశాఖపట్నంలో జరగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంలో ఎంఎస్ ధోనీని తాము ఫాలో అవుతున్నామని తెలిపాడు.
Nidhan
ఉప్పల్ టెస్ట్‌లో నెగ్గి జోరు మీద ఉంది ఇంగ్లండ్. బజ్‌బాల్ క్రికెట్‌తో భారత్‌ను ఓడిస్తామని, సిరీస్‌ను పట్టేస్తామని ముందు ఆ జట్టు ప్రకటనలు చేసినప్పుడు అందరూ వింతగా చూశారు. సొంతగడ్డపై సింహం లాంటి టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదని.. బజ్‌బాల్ ఫార్ములాతో ఆడితే ఆ టీమ్‌కే ఓటమి తప్పదని హెచ్చరించారు. కానీ వాటిని బేఖాతరు చేసిన ఇంగ్లీష్ టీమ్ అదే ఫార్ములాకు కట్టుబడి ఆడింది. మొదటి రెండ్రోజులు తమ ప్లాన్ వర్కౌట్ కాకపోయినా అదే గేమ్‌ను కంటిన్యూ చేస్తూ పోయింది. దీంతో వారి దూకుడును ఎదుర్కోలేక రోహిత్ సేన చేతులెత్తేసింది. మొదటి టెస్టులో నెగ్గడంతో 5 టెస్టుల ఈ సిరీస్‌ను సొంతం చేసుకోగలమనే ధీమా ఇంగ్లండ్‌లో కనిపిస్తోంది. వైజాగ్ టెస్ట్‌లోనూ గెలిచి భారత్‌పై మరింత ఒత్తిడి పెడదామని ఆ జట్టు భావిస్తోంది. ఈ టైమ్‌లో ఆ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని తాము ఫాలో అవుతున్నామని తెలిపాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో భాగమవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని స్టోక్స్ అన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోని లాంటి వారితో పనిచేసే ఛాన్స్ దక్కిందన్నాడు. ధోని-ఫ్లెమింగ్ మధ్య ఉండే బాండింగ్, తీసుకున్న నిర్ణయాలపై వాళ్లు నిలబడే తీరు అద్భుతమన్నాడు. ఈ విషయంలో వాళ్లిదర్నీ స్ఫూర్తిగా తీసుకొని తాను, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ముందుకు సాగుతున్నామని తెలిపాడు. ‘చెన్నై జట్టులో భాగమవడం అద్భుతం. గతంలో పూణె జట్టులో ఉన్నప్పుడు ఫ్లెమింగ్, ధోనీతో కలసి పనిచేశా. వాళ్లిద్దరూ ఒకర్నొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకుంటారు. కోచ్, కెప్టెన్‌గా డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఒకరిపై ఒకరు వాళ్లు ఉంచే నమ్మకం సూపర్. వాళ్లిద్దరూ ఒకర్నొకరు బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి నిర్ణయాన్ని కచ్చితత్వంతో తీసుకుంటారు. టీమ్ గెలుపు కోసం ఏం అవసరమో అదే చేస్తారు’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
జట్టు గెలుపు కోసం ధోని, ఫ్లెమింగ్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడరని స్టోక్స్ తెలిపాడు. అందుకే వాళ్లిద్దర్నీ మెకల్లమ్, తాను ఫాలో అవుతున్నామని చెప్పాడు. టీమ్ కోసం బెస్ట్ డిసిషన్స్ను సాధ్యమైనంత త్వరగా, కచ్చితత్వంతో, నిష్పాక్షికంగా తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. అలాగే తీసుకున్న నిర్ణయాలపై తామిద్దరం నిలబడతామని.. మంచైనా, చెడైనా దాన్ని ఎదుర్కొంటామని వ్యాఖ్యానించాడు స్టోక్స్. దీన్నే ఇక మీదట కూడా కొనసాగిస్తామన్నాడు. కాగా, రెండో టెస్ట్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పల్ టెస్ట్‌లో పిచ్ అటు బ్యాటర్లతో పాటు ఇటు స్పిన్నర్లు, పేసర్లకు కూడా సహకరించింది. స్పిన్‌తో పాటు స్వింగ్‌కు కూడా మంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో వైజాగ్ పిచ్‌ను ఎలా రూపొందించారనేది ఆసక్తికరంగా మారింది. మరి.. తాము ధోనీని ఫాలో అవుతున్నామంటూ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ben Stokes said, “MS Dhoni and Fleming have an incredible understanding. Whatever decision they have to make very quickly, it’s always based around what’s best for the team. That’s something me and Brendon McCullum always try to follow”. (JioCinema). pic.twitter.com/82rJ08up8L
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024