Nidhan
టీమిండియా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్ బాధలో ఉంది. ఈ నిరాశలో నుంచి బయటపడి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది స్టోక్స్ సేన.
టీమిండియా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్ బాధలో ఉంది. ఈ నిరాశలో నుంచి బయటపడి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది స్టోక్స్ సేన.
Nidhan
వరుస గెలుపులు, ఫుల్ డామినేషన్, ఎక్కడకు వెళ్లినా స్వాగతం పలికే విజయాలు.. ఇదీ కొన్నాళ్ల కింద వరకు ఇంగ్లండ్ టీమ్ సిచ్యువేషన్. ఆ జట్టు ప్రయోగిస్తున్న బజ్‌బాల్ వలలో పడి మహా మహా జట్లే అతలాకుతలం అయ్యాయి. ఓటమో, గెలుపో ఏదో ఒకటి తేలిపోవాల్సిందే అన్నట్లు స్టోక్స్ సేన ఆడుతూ ప్రత్యర్థులను వణికించింది. కానీ పది రోజుల్లో అంతా మారిపోయింది. భారత్ చేతిలో వరుసగా రెండు ఘోర ఓటములు ఎదురవడంతో ఇంగ్లీష్ టీమ్‌కు ఏదీ పాలుపోవడం లేదు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తవడాన్ని ఇంగ్లండ్ ప్లేయర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆ టీమ్‌కు ఓ గుడ్ న్యూస్. ఒకవేళ ఇది గానీ వర్కౌట్ అయిందా పర్యాటక జట్టును ఆపడం టీమిండియాకు కష్టమే. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రాజ్‌కోట్ టెస్టులో భారత జట్టు దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆ టీమ్‌కు, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వెన్ను నొప్పి కారణంగా దాదాపుగా ఏడాది కాలం నుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న ఇంగ్లీష్ జట్టు సారథి బెన్ స్టోక్స్ తిరిగి బంతిని పట్టుకున్నాడని తెలుస్తోంది. నెట్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. రాంచీ ఆతిథ్యం ఇస్తున్న నాలుగో టెస్టులో అతడు బౌలింగ్‌కు దిగడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వీటికి తాజాగా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. మూడో టెస్టు తర్వాత ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు స్టోక్స్. ఈ సందర్భంగా మీరు బౌలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? అని అతడికి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. తాను కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేనని స్టోక్స్ చెప్పాడు.
‘కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేను. అలాగని చేయననీ అనలేను. నేను బౌలింగ్ చేయాలా? వద్దా? అనే దాని గురించి మా మెడికట్ టీమ్‌తో ఇంకా డిస్కస్ చేస్తున్నా. కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం నేను 100 పర్సెంట్ బౌలింగ్ చేయగలుగుతున్నా. ఆ టైమ్‌లో నాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. త్వరలో తిరిగి బౌలింగ్ మొదలు పెట్టగలనని ఆశిస్తున్నా’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. రాంచీ టెస్టులో స్టోక్స్ బౌలింగ్ చేయడం పక్కా అని అంటున్నారు. ప్రమాదం ముంచుకొస్తోందని.. అతడు బౌలింగ్‌కు దిగితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడోనని చెబుతున్నారు. అయితే టీమిండియా బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఇదేమంత డేంజర్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. జైస్వాల్, రోహిత్, సర్ఫరాజ్, జడేజాలు స్టోక్స్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటారని అంటున్నారు. ఇక, టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటిదాకా 197 వికెట్లు తీయడం గమనార్హం. మరి.. స్టోక్స్ ప్రమాదాన్ని భారత్ ఈజీగా దాటుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: హార్ధిక్ పాండ్యాకు షాక్..! రోహిత్ శర్మకు అండగా గంగూలీ!
England captain Ben Stokes has hinted he may make a return to bowling duties for the remainder of the series in India.#INDvsENG #EnglandCricket #BenStokes #CricketTwitter pic.twitter.com/P3GKcqEjrJ
— InsideSport (@InsideSportIND) February 20, 2024