iDreamPost

Axar Patel: వీడియో: కళ్లు చెదిరే బాల్‌ వేసిన అక్షర్‌! బిత్తరపోయిన బెయిర్‌స్టో

  • Published Jan 25, 2024 | 1:30 PMUpdated Jan 25, 2024 | 1:30 PM

బజ్​బల్​ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్​తో చెడుగుడు ఆడుకుంటోంది భారత్. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ టీమ్​కు బైర్లు కమ్ముతున్నాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అయితే కళ్లు చెదిరే బంతితో బెయిర్​స్టోను బిత్తరపోయేలా చేశాడు.

బజ్​బల్​ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్​తో చెడుగుడు ఆడుకుంటోంది భారత్. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ టీమ్​కు బైర్లు కమ్ముతున్నాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అయితే కళ్లు చెదిరే బంతితో బెయిర్​స్టోను బిత్తరపోయేలా చేశాడు.

  • Published Jan 25, 2024 | 1:30 PMUpdated Jan 25, 2024 | 1:30 PM
Axar Patel: వీడియో: కళ్లు చెదిరే బాల్‌ వేసిన అక్షర్‌! బిత్తరపోయిన బెయిర్‌స్టో

ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లండ్​కు చుక్కలు చూపిస్తోంది టీమిండియా. 5 టెస్టుల సిరీస్​లో భాగంగా గురువారం ప్రారంభమైన మొదటి మ్యాచ్​లో పర్యాటక జట్టుకు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు భారత బౌలర్లు. టాస్ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి అరగంట బాగానే ఆడింది. వికెట్లేమీ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పిచ్ నుంచి పేసర్లకు మద్దతు లభించకపోవడంతో జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35) అటాకింగ్​కు దిగారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. క్రీజులో నిలదొక్కుకున్న ఓపెనర్లు క్రాలే, డకెట్​ను అశ్విన్ వెనక్కి పంపాడు. క్రాలే సిరాజ్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరుకున్నాడు. డకెట్​ను వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు అశ్విన్. ఆ తర్వాత ఓలీ పోప్​ (1)ని జడేజా ఔట్ చేశాడు. అనంతరం జో రూట్ (29), జానీ బెయిర్​స్టో (37) మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పారు. కానీ బెయిర్​స్టోను ఓ అద్భుత బంతితో వెనక్కి పంపాడు అక్షర్ పటేల్.

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్​ను బెయిర్​స్టో, రూట్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలసి నాలుగో వికెట్​కు 61 పరుగులు జోడించారు. కానీ లంచ్ తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. సెకండ్ సెషన్​లో పిచ్ నుంచి స్పిన్​కు మద్దతు లభించడంతో అక్షర్, అశ్విన్ మరింతగా చెలరేగారు. ముఖ్యంగా అక్షర్ తన స్పిన్​తో ప్రత్యర్థులను తిప్పిపడేస్తున్నాడు. ఓ కళ్లు చెదిరే బంతితో బెయిర్​స్టోను అతడు ఔట్ చేశాడు. అక్షర్ వేసిన బంతి మిడ్ స్టంప్​ లైన్​లో పడి ఒక్కసారిగా టర్న్ అయింది. బంతి పడిన వేగానికి అనూహ్యంగా తిరగడంతో బెయిర్​ స్టోకు ఏం చేయాలో పాలుపోలేదు. బాల్ పడ్డాక నేరుగా వస్తుందనుకుంటే అది కాస్త బెయిర్​స్టో బ్యాట్​ను దాటుకొని వెళ్లి ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బిత్తరపోయాడు.

బాల్ పడి ఎలా బౌల్డ్ అయ్యాడో కూడా బెయిర్​స్టోకు అర్థం కాలేదు. దూకుడుగా ఆడుతూ భారత్​ను ప్రెజర్​లో పెట్టేందుకు ప్రయత్నించిన బెయిర్ స్టో ఔట్ కావడంతో ఇంగ్లండ్ పూర్తిగా డిఫెన్స్​లో పడిపోయింది. ఆ క్రీజులోకి తర్వాత వచ్చిన బెన్ ఫోక్స్ (4)ను కూడా అక్షరే ఔట్ చేశాడు. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 140 పరుగులతో ఉంది ఇంగ్లండ్. బజ్​బాల్ క్రికెట్​తో అందర్నీ భయపెట్టిస్తున్న ఇంగ్లీష్ టీమ్​కు ఈ మ్యాచ్​లో భారత్ పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. బ్యాట్స్​మెన్​కు చుట్టూ ఫీల్డర్లను మోహరించి ఫుల్ అటాకింగ్ మోడ్​లో బౌలింగ్ వేయిస్తున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే మరో 30 పరుగుల్లోపే ఆ టీమ్ చాప చుట్టేసేలా ఉంది. మరి.. బెయిర్​స్టోను అక్షర్ ఔట్ చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి