iDreamPost
android-app
ios-app

నా రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలి.. కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 26, 2024 | 10:48 AM Updated Updated Feb 26, 2024 | 10:48 AM

భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలన్నాడు. కుంబ్లే ఇంకా ఏమన్నాడంటే..

భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలన్నాడు. కుంబ్లే ఇంకా ఏమన్నాడంటే..

  • Published Feb 26, 2024 | 10:48 AMUpdated Feb 26, 2024 | 10:48 AM
నా రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలి.. కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన అకౌంట్​లో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్​గా అతడు నిలిచాడు. ఆల్ టైమ్ గ్రేట్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు. బెన్ డకెట్, ఓలీ పోప్ వికెట్లను తీసిన ఈ స్టార్ స్పిన్నర్.. స్వదేశంలో టెస్టుల్లో 351 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఉన్న కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. కుంబ్లే, అశ్విన్ మినహా మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. ఈ లిస్టులో హర్భజన్ సింగ్ (265 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో అశ్విన్ 351 వికెట్లు పూర్తి చేసుకోవడంపై కుంబ్లే రియాక్ట్ అయ్యాడు. తన మరో రికార్డును కూడా అతడు బ్రేక్ చేయాలని అన్నాడు.

రవిచంద్రన్ అశ్విన్​కు కంగ్రాట్స్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నా మరో రికార్డునూ అతడు బద్దలు కొట్టాలి. టెస్టుల్లో ఫైఫర్స్ (35 సార్లు) విషయంలో అతడు నాతో సమానంగా ఉన్నాడు. త్వరలో అశ్విన్ నన్ను అధిగమించాలని కోరుకుంటున్నా. అతడు ఇంకా చాలా కాలం పాటు ఆడగలడు. అశ్విన్ ఆ ఘనతను అందుకుంటే సంతోషిస్తా. అతడికి ఆల్ ది బెస్ట్’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. డకెట్, పోప్​ను ఔట్ చేసిన తర్వాత మరో 3 వికెట్లు తీశాడు అశ్విన్. తద్వారా మరో ఫైఫర్​ను తన అకౌంట్​లో వేసుకున్నాడు. టెస్టుల్లో మోస్ట్ ఫైఫర్స్ (5 వికెట్లు) తీసిన భారతీయ బౌలర్ల జాబితాలో కుంబ్లే (35 సార్లు)తో సమానంగా నిలిచాడు అశ్విన్. ఇంకోసారి 5 వికెట్లు తీస్తే ఈ లిస్టులో అతడే నంబర్​ వన్​గా నిలుస్తాడు. అందుకే కుంబ్లే పైవిధంగా స్పందించాడు. అశ్విన్ తన రికార్డును బ్రేక్ చేయాలన్నాడు.

కుంబ్లే (35), అశ్విన్ (35) తర్వాత మోస్ట్ ఫైఫర్స్ లిస్ట్​లో మూడో స్థానంలో ఉన్నాడు హర్భజన్ (25). ఇక, తన రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలంటూ కుంబ్లే చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇలా ఏ క్రికెటర్ కోరుకోరని.. కానీ తన రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలని కుంబ్లే అనడం గొప్ప విషయమని అంటున్నారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడిగానూ కుంబ్లే (619)నే ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. ఆ రికార్డును కూడా అశ్విన్ అధిగమించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ స్పిన్నర్ ఫిట్​నెస్ లెవల్స్ చూస్తుంటే ఈజీగా మరో 4 ఏళ్లు ఆడతాడని.. కాబట్టి కుంబ్లే రికార్డును బద్దలు కొట్టడం సాధ్యమేనని అంటున్నారు. మరి.. అశ్విన్​పై కుంబ్లే చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమిండియాలో నెక్ట్స్ ధోని అతడే.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!