Nidhan
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఈ విజయంతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో సంతోషంలో ఉంది రోహిత్ సేన. ఈ తరుణంలో కింగ్ కోహ్లీకి హిట్‌మ్యాన్ థాంక్స్ చెప్పాలని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఈ విజయంతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో సంతోషంలో ఉంది రోహిత్ సేన. ఈ తరుణంలో కింగ్ కోహ్లీకి హిట్‌మ్యాన్ థాంక్స్ చెప్పాలని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.
Nidhan
బజ్‌బాల్‌ను ఎదుర్కోలేరని అన్నారు. స్టార్ ప్లేయర్లు లేరు కాబట్టి ఓటమి తప్పదన్నారు. టెస్టుల్లో టీమ్ పనైపోయిందని విమర్శించారు. కానీ వీటన్నింటికీ వరుస విజయాలతో దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చింది టీమిండియా. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సొంతం చేసుకుంది. వైజాగ్, రాజ్‌కోట్‌లో ఇంగ్లీష్ టీమ్‌ను మట్టికరిపించిన రోహిత్ సేన.. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులోనూ ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో తమ మీద వస్తున్న విమర్శలన్నింటికీ చెక్ పెట్టింది. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్, రజత్ పాటిదార్ లాంటి డెబ్యుటెంట్స్తో పాటు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ వంటి యంగ్‌స్టర్స్‌తో నిండిన టీమ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కింగ్ కోహ్లీకి రోహిత్ థాంక్స్ చెప్పాల్సిందేనని అన్నాడు.
భారత జట్టు ప్రస్తుతం ఆడుతున్న తీరు, టీమ్‌లో కనిపిస్తున్న దూకుడుకు విరాట్ కోహ్లీనే కారణమని కుక్ చెప్పాడు. టీమ్ సక్సెస్‌కు అతడికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఆడగలగడం, ఫైట్ బ్యాక్ చేయడం, ఓటమిని ఒప్పుకోకపోవడం లాంటివి జట్టులోని ఆటగాళ్లకు విరాట్ అలవాటు చేశాడని తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఎంతో రాటుదేలిందని.. పోరాటతత్వాన్ని అలవర్చుకుందన్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు మరింత స్ట్రాంగ్‌గా, టఫ్‌గా తయారైందన్నాడు. అందుకు కోహ్లీకి రోహిత్ థాంక్స్ చెప్పాలన్నాడు కుక్. హిట్‌మ్యాన్ పనిని కింగ్ ఈజీ చేశాడన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పలుమార్లు టీమిండియా ఒత్తిడిలో పడిందని, ఓటమి అంచున కూడా నిలిచిందని.. అయినా వాళ్లు సూపర్బ్‌గా ఫైట్ బ్యాక్ చేశారని కుక్ గుర్తుచేశాడు. రెండు సార్లు వెనుకబడ్డా తిరిగి అంతే దీటుగా కమ్‌బ్యాక్ ఇచ్చారని.. సిరీస్‌ను సొంతం చేసుకున్నారని పేర్కొన్నాడు. ఇది నిజంగా గొప్ప విషయమన్నాడు.
యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్ గురించి కూడా కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఫుట్ మూమెంట్, బ్యాలెన్స్ అద్భుతంగా ఉందన్నాడు. షాట్లు ఆడటంతో పాటు డిఫెన్స్ చేయడంలోనూ జురెల్ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడని మెచ్చుకున్నాడు. ఎక్కువ శాతం బంతుల్ని లెగ్ సైడ్ వైపు డిఫెన్స్ చేయడం ద్వారా సాధ్యమైనన్ని డాట్ బాల్స్ లేకుండా.. సింగిల్స్ ఉండేలా చూసుకోవడం మంచి విషయమన్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తోపు బ్యాటర్ అని.. అయితే అతడితో కంపేర్ చేస్తే బాల్ మెరిట్‌ను పర్ఫెక్ట్గా అంచనా వేసి ఆడటంలో జురెల్‌కు కాస్త ఎక్కువ మార్కులు ఇస్తానన్నాడు కుక్. బ్యాట్‌తో అదరగొడుతున్న జురెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లోకి పైకి తీసుకొచ్చి.. జడేజాను కిందకు పంపాలని సూచించాడు. మానసికంగానూ ధృవ్ ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్నాడని తెలిపాడు. మరి.. కోహ్లీకి రోహిత్ థాంక్స్ చెప్పాలంటూ కుక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లైవ్ మ్యాచ్ లో లేడీ క్రికెటర్ కు పెళ్లి ప్రపోజల్.. రిప్లై ఏంటంటే?
Alastair Cook gives credit to Virat Kohli for India’s success in Test cricket 🙌#AlastairCook #ViratKohli #INDvENG #CricketTwitter pic.twitter.com/q3jCX19Hoe
— InsideSport (@InsideSportIND) February 28, 2024