వీడియో: సూపర్‌ బాల్‌తో వికెట్లను గాల్లో ఎగరేసిన ఆకాష్‌ దీప్‌! కానీ..

ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో అరంగేట్ర బౌలర్ ఆకాశ్​ దీప్ అదరగొడుతున్నాడు. మైండ్​బ్లోయింగ్ డెలివరీస్​తో ఇంగ్లీష్​ బ్యాటర్లను వణికిస్తున్నాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో అరంగేట్ర బౌలర్ ఆకాశ్​ దీప్ అదరగొడుతున్నాడు. మైండ్​బ్లోయింగ్ డెలివరీస్​తో ఇంగ్లీష్​ బ్యాటర్లను వణికిస్తున్నాడు.

రాంచీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఫీల్డింగ్​కు దిగిన రోహిత్ సేన అదరగొడుతోంది. ప్రత్యర్థి బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఒక రేంజ్​లో పోయిస్తున్నారు. ముఖ్యంగా అరంగేట్ర బౌలర్ ఆకాశ్​ దీప్ దెబ్బకు అపోజిషన్ బ్యాటర్లు వణికిపోతున్నారు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో అతడు విసురుతున్న బంతులు స్వింగ్ అయి వికెట్ల మీదకు దూసుకొస్తున్నాయి. ఈ బుల్లెట్ బంతులకు ఇంగ్లీష్ బ్యాటర్ల దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆకాశ్ వేసిన ఓ సూపర్ బాల్​కు జాక్ క్రాలే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అంపైర్ ఔట్​గా ఇవ్వలేదు.

ఆకాశ్​ దీప్ వేసిన బాల్ ఆఫ్ స్టంప్​కు బయట పడి జాక్ క్రాలే వైపు దూసుకొచ్చింది. బాల్ స్వింగ్ అవుతుందని అర్థం చేసుకున్న క్రాలే.. డిఫెన్స్ చేశాడు. కానీ ఓవర్ స్వింగ్ అయిన బాల్ అతడి బ్యాట్​ను దాటుకొని వెళ్లి వికెట్లను లేపేసింది. వికెట్ గాల్లోకి ఎగరడంతో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ సంబురాలు చేసుకున్నాడు. గాల్లో ఎగురుతూ సాధించానంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ దాన్ని నో బాల్​గా ప్రకటించాడు అంపైర్. దీంతో క్రాలే బ్రతికిపోయాడు. అయితే ఇంకా కసిగా బౌలింగ్ చేసిన ఆకాశ్.. తక్కువ టైమ్​లోనే 2 వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (11)తో పాటు ఓలీ పాప్ (0)ను ఔట్ చేశాడు. అరంగేట్ర మ్యాచ్​లోనే ఇద్దరు కీలక ప్లేయర్లను ఔట్ చేయడంతో ఆకాశ్​ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఇతడ్ని ఎందుకు ఆడించలేదంటూ అడుగుతున్నారు. మరి.. ఆకాశ్ దీప్​ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టం.. ‘దేవర’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Show comments