iDreamPost
android-app
ios-app

ఆకాశ్ దీప్ సక్సెస్ వెనుక కోహ్లీ.. అప్పుడు పడిన కష్టం వల్లే..!

  • Published Feb 23, 2024 | 1:24 PM Updated Updated Feb 23, 2024 | 1:24 PM

రాంచీ టెస్టులో అదరగొడుతున్న డెబ్యూ బౌలర్ ఆకాశ్ దీప్ ఈ స్థాయికి చేరుకునేందుకు కఠోరంగా శ్రమించాడు. అతడి సక్సెస్ వెనుక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

రాంచీ టెస్టులో అదరగొడుతున్న డెబ్యూ బౌలర్ ఆకాశ్ దీప్ ఈ స్థాయికి చేరుకునేందుకు కఠోరంగా శ్రమించాడు. అతడి సక్సెస్ వెనుక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

  • Published Feb 23, 2024 | 1:24 PMUpdated Feb 23, 2024 | 1:24 PM
ఆకాశ్ దీప్ సక్సెస్ వెనుక కోహ్లీ.. అప్పుడు పడిన కష్టం వల్లే..!

ఆకాశ్ దీప్.. ఒకే ఒక్క స్పెల్​తో క్రికెట్ దునియాలో చర్చనీయాంశంగా మారిపోయాడు. భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమించిన ఈ బౌలర్ డ్రీమ్ ఎట్టకేలకు నెరవేరింది. రాంచీ ఆతిథ్యం ఇస్తున్న నాలుగో టెస్టులో అరంగేట్రం చేశాడు ఆకాశ్. వర్క్ లోడ్ కారణంగా సీనియర్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది భారత మేనేజ్​మెంట్. దీంతో అతడి ప్లేసులో జట్టులోకి వచ్చిన ఆకాశ్.. తొలి మ్యాచ్​లోనే దుమ్మురేపుతున్నాడు. బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడి ఇన్ స్వింగర్లను ఎదుర్కోలేక ఇంగ్లీష్​ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఫస్ట్ స్పెల్​లోనే ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్​తో పాటు ఓలీ పోప్​ను కూడా వెనక్కి పంపాడు ఆకాశ్. అలాంటి ఈ పేసర్ ఈ రేంజ్​కు చేరుకోవడం వెనుక చాలా మంది కృషి దాగి ఉంది. ఆకాశ్ సక్సెస్ వెనుక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.

బిహార్​కు చెందిన ఆకాశ్ దీప్.. క్రికెట్ కోసం వెస్ట్ బెంగాల్​కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత అప్పటి బెంగాల్ క్రికెట్ హెడ్ సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విజన్-2020 ప్రోగ్రామ్​తో ఆ రాష్ట్ర సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అలా ఫస్ట్ క్లాస్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్​ దీప్ అక్కడ అదరగొట్టాడు. ​అతడిలో ఉన్న స్పెషల్ టాలెంట్​ను పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుర్తించింది. ఆర్సీబీ స్కౌటింగ్ టీమ్ అతడ్ని సానబెట్టింది. అప్పట్లో బెంగళూరు కెప్టెన్​గా ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఆకాశ్​ను ఎంకరేజ్ చేశాడు. అతడు పనికొస్తాడని గుర్తించి ప్రోత్సహించాడు. అప్పుడు పడిన కష్టమే ఇప్పుడు పనికొచ్చింది. 2022లో ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ 5 మ్యాచులు ఆడి 5 వికెట్లు తీశాడు. గత సీజన్​లో కేవలం రెండే మ్యాచులు ఆడాడు.

ఐపీఎల్-2024లో కూడా బెంగళూరు తరఫునే బరిలోకి దిగనున్నాడు ఆకాశ్ దీప్. అతడి ప్రతిభపై నమ్మకం ఉంచిన ఆర్సీబీ మేనేజ్​మెంట్ రిటైన్ చేసుకుంది. గత రెండు, మూడేళ్లుగా బెంగళూరుతో ప్రయాణిస్తున్న ఆకాశ్ దీప్.. విరాట్ కోహ్లీకి మంచి ఫ్రెండ్​గా మారాడు. వాళ్లిద్దరి మధ్య​ మంచి అనుబంధం ఉంది. ఇది మ్యాచులతో పాటు ఆర్సీబీ రిలీజ్ చేసే పలు వీడియోల్లోనూ చూడొచ్చు. బెంగళూరుతో ఆకాశ్​కు ఉన్న అనుబంధం గురించి ఆ టీమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ నాలుగో టెస్టులో కామెంట్రీ చేస్తూ పంచుకున్నాడు. ‘ఆర్సీబీ స్కౌటింగ్​ సిస్టమ్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆకాశ్ దీప్​లోని ప్రతిభను వాళ్లు రెండు, మూడేళ్ల కిందే పసిగట్టారు. అతడ్ని బాగా ప్రోత్సహించారు’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, ఆర్సీబీ ప్లేయర్​ ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం, డెబ్యూ మ్యాచ్​లో అదరగొట్టడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశ్ భారత్ తరఫున సూపర్బ్​గా రాణించాలని కోరుకుంటున్నారు. ప్రతిభ ఉన్న ప్లేయర్లను సానబెడితే ఎలా తయారవుతారనే దానికి ఆకాశ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆకాశ్ దీప్ సక్సెస్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: సూపర్‌ బాల్‌తో వికెట్లను గాల్లో ఎగరేసిన ఆకాష్‌ దీప్‌! కానీ..