తండ్రి, సోదరుడ్ని కోల్పోయా.. వాళ్ల వల్లే ఈ పొజిషన్​లో ఉన్నా: ఆకాశ్ దీప్

రాంచీ టెస్టులో బౌలింగ్​లో అదరగొట్టిన యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే ఈ పొజిషన్​లో ఉన్నానని అన్నాడు.

రాంచీ టెస్టులో బౌలింగ్​లో అదరగొట్టిన యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే ఈ పొజిషన్​లో ఉన్నానని అన్నాడు.

ఆకాశ్​ దీప్.. భారత క్రికెట్​లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. ఒకే ఒక్క స్పెల్​తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడీ యంగ్ పేసర్. వర్క్ లోడ్ కారణంగా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో నాలుగో టెస్టులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్ దీప్. ఆడిన ఫస్ట్ మ్యాచ్​లోనే ఇంగ్లండ్ టీమ్ బ్యాటర్లకు ఒక రేంజ్​లో పోయించాడు. తొలి స్పెల్​లోనే బెన్ డకెట్, ఓలీ పోప్, జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్​లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. పిచ్​ నుంచి లభిస్తున్న మద్దతును ఉపయోగించుకొని ఇన్​ స్వింగింగ్ డెలివరీస్​తో ఇంగ్లీష్ బ్యాటర్లకు పోయించాడు. 140 కి.మీ.లకు తగ్గని వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ ఇంగ్లండ్​ను కట్టిపడేశాడు. అతడి బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు వణికిపోయారు. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి, భారత జట్టుకు ఆడేందుకు ఎన్నో కష్టాలు పడ్డానన్నాడు ఆకాశ్. తన తండ్రి, సోదరుడ్ని కోల్పోయానంటూ ఎమోషనల్ అయ్యాడు.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం చాలా ఎమోషనల్ మూమెంట్ అని ఆకాశ్ దీప్ అన్నాడు. ఒకే ఏడాదిలో తన తండ్రితో పాటు సోదరుడ్ని కూడా కోల్పోయానని చెప్పాడు. బెంగాల్ టీమ్ నుంచి భారత క్రికెట్ జట్టుకు ఆడేంత వరకు సాగిన ఈ ప్రయాణం ఎంతో క్లిష్టమైందని.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపాడు. కష్టసమయంలో తనకు కుటుంబం ఎంతో అండగా నిలిచిందని చెప్పాడు. తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ చాలా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు ఆకాశ్ దీప్. డెబ్యూ మ్యాచ్ అని తానేమీ భయపడలేదన్నాడు. కోచ్ ద్రవిడ్​తో పాటు సిబ్బందితో మాట్లాడానని.. అందుకే ఎలాంటి టెన్షన్ అనిపించలేదన్నాడీ స్పీడ్​స్టర్. కాన్ఫిడెంట్​గా బరిలోకి దిగానన్నాడు. కానీ ప్రతి మ్యాచ్​ను ఆఖరి మ్యాచ్​గానే భావిస్తానని.. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించాడు.

‘ప్రతి మ్యాచ్​ను చివరి మ్యాచ్​గానే చూస్తా. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. లెంగ్త్ విషయంలో బుమ్రా భాయ్ సలహా ఇచ్చాడు. కొంచెం మార్చుకుంటే సరిపోతుందని చెప్పాడు. అదే ఫాలో అయ్యా. నో బాల్ విషయంలో తప్పు చేశానని అనిపించింది. దాని వల్ల టీమ్ కష్టాల్లో పడొద్దనుకున్నా. మ్యాచ్ ఓటమికి అది కారణం కాకూడదనుకున్నా. మొదట్లో వికెట్ నుంచి మంచి సాయం లభించింది. కానీ ఆ తర్వాత బాల్ సాఫ్ట్ అయింది. దీంతో పాటు పిచ్ చాలా స్లో అయింది. అయినా బౌలర్లంతా శ్రమించాం. సరైన ప్లేస్​లో బాల్స్ వేస్తూ అపోజిషన్ టీమ్​ను ప్రెజర్​లోకి నెట్టేందుకు ప్రయత్నించాం’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు. మరి.. రాంచీ టెస్టులో యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రూట్-స్టోక్స్ పింకీ ఫింగర్ సెలబ్రేషన్స్! దానికి అర్ధమేంటంటే?

Show comments