Nidhan
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత్. సిరీస్‌లో ఈ మ్యాచ్ డిసైడర్‌గా మారడంతో రెండు టీమ్స్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత్. సిరీస్‌లో ఈ మ్యాచ్ డిసైడర్‌గా మారడంతో రెండు టీమ్స్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు అంతా రెడీ అయిపోయింది. ఈ రెండు టీమ్స్ మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ సిరీస్‌లో డిసైడర్‌గా మారింది. ఇప్పటికే టీమిండియా 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఇక్కడే సిరీస్‌ను పట్టేయాలని రోహిత్ సేన చూస్తోంది. పర్యాటక ఇంగ్లండ్‌కు ఇది చావోరేవో లాంటి మ్యాచ్. రాంచీలో గెలిస్తే ఆ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఎలాగైనా నాలుగో టెస్టులో విజయఢంకా మోగించాలని స్టోక్స్ సేన భావిస్తోంది. కానీ గత రెండు మ్యాచుల్లో భారత ప్లేయర్ల ఆటతీరు, వాళ్లు చూపించిన దూకుడు, కాన్ఫిడెన్స్ చూస్తుంటే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ను మడతపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
రాంచీ టెస్టులో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. సిరీస్‌లోని తొలి మూడు మ్యాచుల్లో అదరగొట్టిన పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్ ఇవ్వనున్నారు. అలాగే గాయం కారణంగా వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుతో తిరిగి టీమ్‌లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంజ్యురీ నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కూ అతడ్ని దూరంగా ఉంచారు. దీంతో రాంచీ టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. ఓపెనింగ్ బాధ్యతల్ని రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మోస్తారు. ఫస్ట్ డౌన్లో శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్‌ను రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా ముందుండి నడిపించనున్నారు. లోయరార్డర్లో ధృవ్ జురెల్ బ్యాటింగ్‌కు దిగుతాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉండనే ఉన్నాడు. వీళ్లతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు.
భారత పేస్ విభాగాన్ని హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. రాంచీ టెస్టులో సిరాజ్‌కు తోడుగా మరో పేసర్‌గా ముఖేష్ కుమార్ టీమ్‌లోకి రానున్నాడు. బుమ్రా స్థానంలో అతడ్ని జట్టులోకి తీసుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాంచీ పిచ్ సిచ్యువేషన్‌ను బట్టి ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండాలో టాస్కు ముందు డిసైడ్ అవుతారు. ఒకవేళ వికెట్ స్పిన్‌కు బాగా సహకరిస్తుందని భావిస్తే బుమ్రా ప్లేసులో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఈ సిరీస్‌లోని వికెట్లు పూర్తిగా స్పిన్‌కు సహకరించిన దాఖలాల్లేవు. కాబట్టి ముఖేష్ టీమ్‌లోకి రావడం పక్కా అని తెలుస్తోంది. కాగా, మూడో టెస్టులో చోటు దక్కకపోవడంతో ముఖేష్‌ను రంజీల్లో ఆడమని బీసీసీఐ సూచించింది. రంజీ మ్యాచ్ ఆడిన అతడు ఒక ఇన్నింగ్స్‌లో 6, మరో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో చెలరేగాడు. రాంచీ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో తిరిగి ముఖేష్‌కు పిలుపొచ్చింది. మరి.. నాలుగో టెస్టులో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు ఉంటాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్/ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్.
ఇదీ చదవండి: విధ్వంసానికి సెహ్వాగ్, గేల్ సిద్ధం! తొలి మ్యాచ్‌లో ముంబైతో తెలంగాణ ఢీ
Getting Ranchi Ready 👌 👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UiZnrbdWBc
— BCCI (@BCCI) February 21, 2024