Nidhan
ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు కీలక భారత ఆటగాడు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు లేని లోటును కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు కీలక భారత ఆటగాడు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు లేని లోటును కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Nidhan
రాజ్‌కోట్ టెస్టులో ఘనవిజయం సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉంది రోహిత్ సేన. మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా రికార్డు సృష్టించింది టీమిండియా. పరుగుల పరంగా చూసుకుంటే భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విక్టరీ కావడం విశేషం. ఊహించిన దాని కంటే సులువుగా విక్టరీ కొట్టడం, బజ్‌బాల్ క్రికెట్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్‌ను రెండోసారి చిత్తు చేయడంతో రోహిత్ సేన సంతోషంలో మునిగిపోయింది. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులో నెగ్గి సిరీస్‌ను అక్కడే పట్టేయాలని చూస్తోంది టీమిండియా. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి రాంచీ టెస్టులో గెలిస్తే 3-1తో సిరీస్ సొంతం అవుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఈ టెస్టుకు ఓ మ్యాచ్ విన్నర్ దూరం కానున్నాడని తెలుస్తోంది. దీంతో అతడి గైర్హాజరీలో కెప్టెన్ రోహిత్ ఎలా నెట్టుకొస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
స్వదేశంలో మరో టెస్టు సిరీస్ విక్టరీపై కన్నేసింది టీమిండియా. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్.. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. అయితే ఈ టెస్టుకు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్ లోడ్ కారణంగా అతడికి నాలుగో టెస్టుకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినికిడి. విశ్రాంతి నేపథ్యంలో రాజ్‌కోట్ నుంచి నేరుగా తన స్వస్థలం అహ్మదాబాద్‌కు బుమ్రా వెళ్లనున్నాడని సమాచారం. నాలుగో టెస్టు కోసం భారత టీమ్ మొత్తం ఫిబ్రవరి 20న మంగళవారం చేరుకోనుంది. బుధవారం నుంచి అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది. అయితే రెస్ట్ ఇస్తుండటంతో బుమ్రా మాత్రం రాంచీకి కాకుండా అహ్మదాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఐదో టెస్టులో కూడా బుమ్రా ఆడేది కష్టమేనని ఎక్స్పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది నాలుగో టెస్టు ఫలితం మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ రాంచీలోనే సిరీస్ నెగ్గితే ఐదో టెస్టులో బుమ్రా బరిలో దిగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అతడి ప్లేసులో యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. అలాగే వరుసగా రెండు మ్యాచుల్లో ఆడకపోతే బుమ్రాకు కూడా ఎక్కువ రెస్ట్ ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నారట. కానీ సిరీస్‌కు డిసైడర్‌గా మారిన నాలుగో టెస్టులో బుమ్రాను ఆడించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆల్రెడీ వైజాగ్ టెస్టు తర్వాత 10 రోజుల రెస్ట్ దొరికిందని.. అది సరిపోతుందని చెబుతున్నారు. మరి.. నాలుగో టెస్టుకు బుమ్రా దూరం అనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్‌కు అన్యాయం! ఇలా జరగడం రెండోసారి
Jasprit Bumrah set to be rested from the 4th Test against England in Ranchi. (Cricbuzz). pic.twitter.com/7L3EyHjaHP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2024