iDreamPost
android-app
ios-app

టాస్‌ ఓడిన భారత్‌! తొలుత ఫీల్డింగ్‌.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

  • Published Feb 23, 2024 | 9:22 AM Updated Updated Feb 23, 2024 | 9:37 AM

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్ ఓడిన టీమిండియా తొలుత ఫీల్డింగ్​కు దిగింది. మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్​ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్ ఓడిన టీమిండియా తొలుత ఫీల్డింగ్​కు దిగింది. మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్​ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 23, 2024 | 9:22 AMUpdated Feb 23, 2024 | 9:37 AM
టాస్‌ ఓడిన భారత్‌! తొలుత ఫీల్డింగ్‌.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ఫీల్డింగ్​కు దిగింది. ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఒక మార్పు జరిగింది. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ మ్యాచ్​కు దూరం పెట్టారు. అతడి స్థానంలో అనూహ్యంగా ఆకాశ్ దీప్​కు తుదిజట్టులో చోటు లభించింది. ఇది అతడికి అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఈ ఒక్క మార్పు తప్పితే టీమ్​లో ఇంకే మార్పులు చేయలేదు. గత టెస్టులో ఆడిన 10 మంది ప్లేయర్లను కొనసాగించారు. పిచ్​ నుంచి పేసర్లకు తొలుత మద్దతు లభిస్తుందని.. మ్యాచ్ గడిచే కొద్దీ స్పిన్నర్లకు టర్న్ లభించే అవకాశం ఉందని టాస్ టైమ్​లో కామెంటేటర్ ఆర్పీ సింగ్ అన్నాడు.

డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్​ దీప్​కు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్యాప్ ఇచ్చి టీమ్​లోకి ఆహ్వానించాడు. అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మిగతా ఆటగాళ్లు కూడా ఆకాశ్​కు బెస్ట్ ఆఫ్​ ది లక్ చెప్పారు. ఆకాశ్ టీమ్​లోకి రావడంతో మరో యంగ్ పేసర్ ముఖేశ్ కుమార్​కు నిరాశే మిగిలింది. ఇక, ఇంగ్లండ్ టీమ్ మ్యాచ్​కు ముందు రోజే తమ ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించింది. స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ప్లేసులో బషీర్, మార్క్ వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్ టీమ్​లోకి వచ్చారు. కాగా, రాంచీ పిచ్ తొలి రోజు బ్యాటింగ్​కు బాగా సహకరించే ఛాన్స్ ఉండటంతో స్టోక్స్ టాస్ నెగ్గగానే బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత జట్టులో బుమ్రా లేడు కాబట్టి సిరాజ్, అశ్విన్ బౌలింగ్​ యూనిట్​ను లీడ్ చేయాల్సి ఉంటుంది. మరి.. నాలుగో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ ​దీప్.