iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?

  • Published Sep 16, 2024 | 9:45 PM Updated Updated Sep 16, 2024 | 10:43 PM

IND vs BAN Series To Be Cancelled: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

IND vs BAN Series To Be Cancelled: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

  • Published Sep 16, 2024 | 9:45 PMUpdated Sep 16, 2024 | 10:43 PM
ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?

భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మ్యాచులకు భారీగా గ్యాప్ రావడంతో ఈ సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. శ్రీలంక టూర్ తర్వాత దాదాపు ఏడు వారాల పాటు భారత జట్టు మ్యాచ్​లు లేకుండా పోయాయి. దీంతో ఆటగాళ్లంతా రెస్ట్ మోడ్​లోకి వెళ్లిపోయారు. కొందరు వెకేషన్స్​లో బిజీ అయిపోతే.. ఇంకొందరు ఇంటి వద్దే ఫ్యామిలీతో కలసి టైమ్ స్పెండ్ చేశారు. ఇప్పుడు బంగ్లా సిరీస్​కు సమయం ఆసన్నమవడంతో అంతా ఒక దగ్గరకు చేరి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19న మొదలయ్యే ఫస్ట్ టెస్ట్​కు రెడీ అవుతున్నారు. బంగ్లాను చిత్తు చేయాలని అనుకుంటున్నారు. రెండు టెస్టుల సిరీస్​ను గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్​తో పాటు మొత్తం సిరీస్ రద్దు కానుందని తెలుస్తోంది.

భారత్-బంగ్లా సిరీస్ క్యాన్సిల్ కానుందని తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్​తో పాటు టీ20 సిరీస్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. హిందూ మహాసభ నిరసన కారణంగా సిరీస్​ రద్దయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ సిరీస్​ను అడ్డుకోవాలంటూ నిరసనలు చేపట్టాలని హిందూ మహాసభ డిసైడ్ అయింది. తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ.. సెకండ్ టెస్ట్​ జరిగే కాన్పూర్​లో, అలాగే మొదటి టీ20కు హోస్ట్​గా ఉన్న గ్వాలియర్​లో హిందూ మహాసభ భారీగా నిరసనలు చేపట్టాలని చూస్తోంది. ఈ విషయంపై ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్​లో హిందువులను ఊచకోత కోస్తున్నారని.. ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అందుకే భారత్-బంగ్లా సిరీస్​కు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

హిందూ మహాసభ వార్నింగ్​తో భారత క్రికెట్ బోర్డు అలర్ట్ అయింది. టెస్ట్, టీ20 సిరీస్​లను ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. తాము అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని, మ్యాచ్​లకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలను రెడీ చేస్తున్నామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సంబంధింత ఆఫీసర్స్​తో ఎప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కాన్పూర్​తో పాటు ఇతర వేదికల్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్​లు తప్పక జరుగుతాయని చెప్పారు. అయితే బీసీసీఐ హామీ ఇస్తున్నా మ్యాచ్​లు జరుగుతాయో లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక, బంగ్లాతో ఫస్ట్ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయర్లు ప్రిపేర్ అవుతున్నారు. ప్రత్యర్థి జట్టును లైట్ తీసుకోకుండా.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా అంతా నెట్స్​లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్​లో చెమటలు కక్కుతున్నారు.