iDreamPost

భారత్-బంగ్లా మ్యాచ్​కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?

  • Published Jun 22, 2024 | 3:11 PMUpdated Jun 22, 2024 | 3:11 PM

పొట్టి కప్పులో మరో టఫ్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. సూపర్-8లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్​ను ఢీకొట్టనుంది రోహిత్ సేన. అయితే ఈ మ్యాచ్​కు వరుణుడి రూపంలో ప్రమాదం పొంచి ఉంది.

పొట్టి కప్పులో మరో టఫ్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. సూపర్-8లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్​ను ఢీకొట్టనుంది రోహిత్ సేన. అయితే ఈ మ్యాచ్​కు వరుణుడి రూపంలో ప్రమాదం పొంచి ఉంది.

  • Published Jun 22, 2024 | 3:11 PMUpdated Jun 22, 2024 | 3:11 PM
భారత్-బంగ్లా మ్యాచ్​కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?

పొట్టి కప్పులో మరో టఫ్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. సూపర్-8లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్​ను ఢీకొట్టనుంది రోహిత్ సేన. మెగాటోర్నీలో ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతున్న మెన్ ఇన్ బ్లూ అదే హవాను కొనసాగించాలని చూస్తోంది. బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. ఆ జట్టును ఓడించడానికి అన్ని రకాలుగా రెడీ అయింది. మన టీమ్ బౌలింగ్ దళం భీకర ఫామ్​లో ఉంది. వాళ్లు అదే జోరును కొనసాగిస్తే బంగ్లా పులులు తోకముడుచుకోవాల్సిందే. గ్రూప్ దశలో బలహీనంగా కనిపించిన భారత బ్యాటింగ్ యూనిట్ ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో సూపర్ టచ్​లోకి వచ్చింది. వాళ్లు అదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకల తప్పదనే చెప్పాలి. అంతా బాగానే ఉన్నా ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే ఉంది.

భారత్-బంగ్లా మ్యాచ్​కు వరుణుడి రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈ సూపర్ పోరుకు ఆతిథ్యం ఇస్తున్న విండీస్​లోని ఆంటిగ్వాలో ఇవాళ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వెదర్ వెబ్​సైట్స్ కూడా అంటున్నాయి. ఇప్పటికే అక్కడ చిన్నపాటి వర్షం పడుతోంది. మ్యాచ్ స్టార్ట్‌ అయ్యే సమయానికి మబ్బులు ఉంటాయని తెలుస్తోంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉండదని వెదర్ రిపోర్ట్స్ అంటున్నాయి. కొన్ని ఓవర్లు తగ్గించైనా మ్యాచ్​ నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ మ్యాచ్ రద్దయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏ టీమ్​కు నష్టం? ఏ టీమ్​కు లాభం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

సూపర్-8లో టీమిండియా, ఆస్ట్రేలియా చెరో విజయంతో ఉన్నాయి. నెట్ రన్​రేట్ పరంగానూ ఈ రెండు జట్లు +2 పైనే కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇవాళ బంగ్లాదేశ్​తో మ్యాచ్ రద్దయితే.. టీమిండియాకు ఒక పాయింట్ మాత్రమే దక్కుతుంది. అప్పుడు 3 పాయింట్లతో ఉంటుంది రోహిత్ సేన. వరుణుడు కరుణించి మ్యాచ్ జరిగి.. బంగ్లాపై మెన్ ఇన్ బ్లూ నెగ్గితే దాదాపు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు వరుసగా రెండు ఓటములు చవిచూసిన బంగ్లాదేశ్ ఇంటిదారి పడుతుంది. ఇక, రెండో బెర్త్ కోసం ఆఫ్ఘానిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్​లో గెలిచిన టీమ్ సెమీస్ రేసులో ఉంటుంది. కంగారూలు నెగ్గితే ఆఫ్ఘాన్​ కథ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఇవాళ బంగ్లాతో మ్యాచ్​ వాన వల్ల రద్దయినా.. ఆసీస్​తో కలసి టీమిండియా సెమీస్​కు వెళ్తుంది. అలా జరగాలంటే రషీద్ సేనను ఆసీస్ ఓడించాలి. ఒకవేళ కంగారూలు ఓడితే.. భారత్​తో జరిగే ఆఖరి మ్యాచ్ కీలకం అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి