iDreamPost
android-app
ios-app

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే! ఆ ముగ్గురు..

  • Published Sep 18, 2024 | 8:56 AM Updated Updated Sep 18, 2024 | 8:56 AM

Team India Playing xi Prediction: బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ కు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందా? అని అందరిలో ఆసక్తినెలకొంది. ఆ ముగ్గురికి జట్టులో ప్లేస్ దక్కే ఛాన్స్ లు తక్కువగా ఉన్నాయి.

Team India Playing xi Prediction: బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ కు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందా? అని అందరిలో ఆసక్తినెలకొంది. ఆ ముగ్గురికి జట్టులో ప్లేస్ దక్కే ఛాన్స్ లు తక్కువగా ఉన్నాయి.

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే! ఆ ముగ్గురు..

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ కు అంతా సిద్దం అయ్యింది. ఇరు జట్లు తమ తమ ప్రణాళికలతో తొలిపోరుకు రెడీ అయ్యాయి. అయితే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఫస్ట్ టెస్ట్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సీనియర్ బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలతో పాటుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. వీరితో పాటుగా యంగ్ ప్లేయర్లు ఆకాశ్ దీప్, యశ్ దయాళ్ జాక్ పాట్ కొట్టారు. దాంతో తొలి టెస్ట్ కు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం.

బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పిచ్ ప్రధానంగా స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ.. ఈ మ్యాచ్ కోసం ఎర్ర మట్టి పిచ్ ను రెడీ చేసినట్లు, పేస్ కు అనుకూలంగా ఉండేందుకు కాస్త గ్రాస్ ను కూడా వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతుందా? లేక ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే మాత్రం జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో అక్షర్ పటేల్ కు ఛాన్స్ దక్కదు. ఇక పేసర్ల విభాగంలో బుమ్రా, సిరాజ్ లతో పాటుగా ఆకాశ్ దీప్, యశ్ దయాల్ లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. ఎర్ర మట్టి పిచ్ రెడీ చేశారన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే ఒక స్పిన్నర్ ను తప్పించే ఛాన్స్ ఉంది.

ఇక బ్యాటర్ల దగ్గరికి వస్తే.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఎంట్రీతో యంగ్ ప్లేయర్లు అయిన సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ కు ప్లేస్ కష్టంగా మారింది. అయితే సర్పరాజ్ ను సెలెక్టర్లు పరిశీలించాలనుకుంటే మాత్రం రాహుల్ ను పక్కన పెట్టొచ్చు. కానీ సీనియర్ ప్లేయర్ అయిన అతడిని పక్కనపెట్టే ఛాన్స్ లు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ- యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. మూడో స్థానంలో శుబ్ మన్ గిల్ ఆ తర్వాత వరుసగా విరాట్ కోహ్లీ, పంత్, రాహుల్ లు బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. కాగా.. జట్టు ఎంపికలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, యశ్ దయాల్/ఆకాశ్ దీప్.