ఫైనల్‌లో గెలవాలంటే.. టాస్‌ గెలిచి ఏం తీసుకోవాలి? రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే నరేంద్ర మోదీ మైదానం పిచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమా? బౌలింగ్‌కు అనుకూలమా? ఒక వేళ టాస్‌ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్‌ చేయాలా? ఫీల్డింగ్‌ చేయాలా? ఇలా చాలా డౌట్స్‌ మధ్యలో అసలు ఈ గ్రౌండ్‌ రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే నరేంద్ర మోదీ మైదానం పిచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమా? బౌలింగ్‌కు అనుకూలమా? ఒక వేళ టాస్‌ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్‌ చేయాలా? ఫీల్డింగ్‌ చేయాలా? ఇలా చాలా డౌట్స్‌ మధ్యలో అసలు ఈ గ్రౌండ్‌ రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఒక్క మ్యాచ్‌.. ఒకే ఒక్క మ్యాచ్‌తో.. క్రికెట్‌ రారాజు ఎవరో తేలిపోతుంది. దాదాపు నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలైన వన్డే క్రికెట్‌ మజాను పంచిన వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ.. చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగియడంతో పాటు.. ప్రపంచ ఛాంపియన్‌ ఎవరో కూడా తేలిపోనుంది. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ టోర్నీని ఏకంగా ఐదు సార్లు ముద్దాడిన కంగారుల జట్టు.. ఆరోసారి గెలుద్దామని ఉవ్విళ్లు ఊరుతుంటే.. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్‌ను గెలిచి.. విశ్వవిజేతగా ఆవిర్భవించాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. మరి ఈ అగ్రశ్రేణి జట్లలో కప్పు ఎవర్ని వరిస్తుందో.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే నరేంద్ర మోదీ మైదానం పిచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమా? బౌలింగ్‌కు అనుకూలమా? ఒక వేళ టాస్‌ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్‌ చేయాలా? ఫీల్డింగ్‌ చేయాలా? ఏది చేస్తే జట్టు విజయావకాశాలు ఎలా ఉంటాయి? ఛేజింగ్‌ ఈజీ అవుతుందా? సెకండ్‌ ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చి బ్యాటింగ్‌ సులువుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. 1984 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రౌండ్‌లో టీమిండియా మొత్తం 19 మ్యాచ్‌లు ఆడింది. అందులో 11 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అలాగే ఆస్ట్రేలియా ఈ గ్రౌండ్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన నాలుగింటిలో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ లెక్కన విన్నింగ్‌ పర్సంటేజ్‌లో ఆస్ట్రేలియా, ఇండియా కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఆసీస్‌కు 66.66 శాతం, ఇండియాకు 57.89 విన్నింగ్‌ పర్సంటేజ్‌ ఉంది.

అలాగే ఈ గ్రౌండ్‌లో 1984 అక్టోబర్‌ 5న తొలి మ్యాచ్‌ భారత్‌-ఆస్ట్రేలియా మధ్యనే జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 32 వన్డేలు జరిగాయి. వాటిలో 17 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. 15 సార్లు ఛేజింగ్‌ చేసిన టీమ్‌ గెలిచింది. కేవలం రెండు మ్యాచ్‌ల తేడానే ఉంది. సో.. తొలుత బ్యాటింగ్‌ చేయడం, బౌలింగ్‌ చేయడం అనే పెద్ద సమస్య కాకపోవచ్చు. ఏ టీమ్‌ అయితే మెరుగైనా ప్రదర్శన చేస్తుందో వారిదే విజయం. టాస్‌ అంత కీలకం కాకపోవచ్చు. ఈ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు 365 హైయెస్ట్‌ స్కోర్‌గా ఉంది. 85 లోయెస్ట్‌ స్కోర్‌గా ఉంది. ఛేజ్‌ చేసిన అత్యధిక స్కోర్‌ 325, అలాగే 196 పరుగులు కూడా ఛేజ్‌ చేయలేక ఓడిపోయిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. సో ఈ గ్రౌండ్‌లో 300 పైగా స్కోర్‌ చేసినా గెలుస్తామనే గ్యారెంటీ లేదు, అలాగే 200లోపు చేసినా ఓడిపోతామనే భయం అక్కర్లేదు. సో.. ఈ టోర్నీ మొత్తం టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసినా, బౌలింగ్‌ చేసినా.. మంచి ప్రదర్శన చేస్తే కప్పు మనదే. మరి ఈ లెక్కలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments