iDreamPost

మరోసారి కోహ్లీ డకౌట్.. ఇంతలా పరువు తీసుకోవడం అవసరమా?

  • Published Jun 24, 2024 | 8:33 PMUpdated Jun 24, 2024 | 10:30 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు పరువు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో కింగ్ టోటల్ ఫెయిలయ్యాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు పరువు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో కింగ్ టోటల్ ఫెయిలయ్యాడు.

  • Published Jun 24, 2024 | 8:33 PMUpdated Jun 24, 2024 | 10:30 PM
మరోసారి కోహ్లీ డకౌట్.. ఇంతలా పరువు తీసుకోవడం అవసరమా?

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ థర్డ్ డౌన్​లోనే బ్యాటింగ్​కు దిగుతుంటాడు. కెరీర్ మొదట్నుంచి అతడు ఇదే స్థానంలో ఆడుతూ వస్తున్నాడు. ఫస్ట్ డౌన్​లో వచ్చి టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటోడు కీలకమైన టీ20 వరల్డ్ కప్​-2024లో ఓపెనింగ్​లో ఆడుతున్నాడు. అయితే ఓపెనర్​గా వచ్చి అతడు పెద్దగా ఏమీ సాధించలేదు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్​లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. యూఎస్​ఏతో మ్యాచ్​లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే సూపర్-8లో 24, 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో మాత్రం అతడు పరువు తీసుకున్నాడు.

ఆసీస్​తో మ్యాచ్​లో మంచి ఇన్నింగ్స్​ ఆడి ఫామ్​లోకి వస్తాడనుకుంటే మళ్లీ ఫ్లాప్ అయ్యాడు విరాట్. 5 బంతులు ఎదుర్కొన్న ఈ టాప్ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. జోష్ హేజల్​వుడ్ బౌలింగ్​ను సరిగ్గా అర్థం చేసుకోలేక చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కోహ్లీ ఔట్ అయిన ఇదే పిచ్​ మీద రోహిత్ భారీ షాట్లు బాదుతున్నాడు. వికెట్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంది. అయినా కోహ్లీ రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇలా పరువు తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కింగ్​ను ఓపెనర్​గా ఆడించాలనేది అత్యాశ అని.. అతడు కూడా అదే కోరుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అత్యాశకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ మరోమారు డకౌట్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి