iDreamPost
android-app
ios-app

IND vs AUS: టీమిండియాను కాపాడిన అంపైర్.. అది​ గానీ బౌండరీకి వెళ్లుంటే..!

  • Author singhj Published - 10:43 AM, Mon - 4 December 23

ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్​లో భారత్ 6 రన్స్ తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియాను అంపైర్ కాపాడాడనే చెప్పాలి.

ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్​లో భారత్ 6 రన్స్ తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియాను అంపైర్ కాపాడాడనే చెప్పాలి.

  • Author singhj Published - 10:43 AM, Mon - 4 December 23
IND vs AUS: టీమిండియాను కాపాడిన అంపైర్.. అది​ గానీ బౌండరీకి వెళ్లుంటే..!

ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్​లో లాస్ట్ పంచ్ కూడా భారత్​దే అయింది. ఇప్పటికే సిరీస్​ను గెలుచుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. గత మ్యాచ్​లో ఫెయిలైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈసారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. అతడికి తోడు బౌలర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ముకేశ్, అక్ష్​దీప్ గొప్పగా బౌలింగ్ చేయడంతో మరో విక్టరీ మన ఖాతాలో పడింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయ్యర్ (53) టాప్ స్కోరర్​గా నిలిచాడు. అతడికి అక్షర్ పటేల్ (31), జితేష్ శర్మ (24) చక్కటి సహకారం అందించారు.

భారత ఇన్నింగ్స్​లో అయ్యర్ ఇన్నింగ్స్ కాస్త స్పెషల్ అని చెప్పాలి. స్కోరు బోర్డు మీద 60 పరుగులు చేరేలోపే 4 వికెట్లు పడ్డాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ (10) సహా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6) పెవిలియన్​కు చేరుకున్నారు. ఈ తరుణంలో జితేష్​తో జోడీకట్టిన అయ్యర్ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సులు కొడుతూనే సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్​ను రొటేట్ చేశారు. ఆ తర్వాత జతేష్ వెనుదిరిగినా.. అక్షర్​తో కలసి మరో మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు అయ్యర్. అతడు పట్టుదలతో ఆడటం వల్లే టీమ్ మంచి టార్గెట్​ను ఆసీస్​ ముందు ఉంచింది.

ట్రిక్కీ పిచ్ మీద ఛేజింగ్​కు దిగిన కంగారూ జట్టుకు మొదట్లోనే షాకిచ్చాడు పేసర్ ముకేశ్ కుమార్. జోష్ ఫిలిప్ (4)ను అతడు వెనక్కి పంపాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (28), బెన్ మెక్​డార్మెట్ (54) బాగానే ఆడారు. ముఖ్యంగా హెడ్ బౌండరీలతో చెలరేగాడు. కానీ అతడితో పాటు ఆరోన్ హార్డీ (6)ని వెంటవెంటనే పెవిలియన్​కు పంపాడు స్పిన్నర్ బిష్ణోయ్. అనంతరం టిమ్ డేవిడ్ (17)తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించేందుకు మెక్​డెర్మాట్ ప్రయత్నించినా భారత బౌలర్ల ముందు అతడి ఆటలు సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పోవడంతో ఆఖరికి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ఆసీస్. ఆ జట్టు ఇన్నింగ్స్​లో ఆఖరి ఓవర్ హైలైట్ అనే చెప్పాలి. విజయానికి 10 రన్స్ చేయాల్సిన దశలో బౌలింగ్​కు వచ్చాడు అర్ష్​దీప్ సింగ్.

క్రీజులో ఉన్న వేడ్ అప్పటికే 4 బౌండరీలతో 22 రన్స్ చేసి జోష్ మీద ఉన్నాడు. అటు అర్ష్​దీప్ 3 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో అతడ్ని వేడ్ ఈజీగా కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మంచి లైన్ అండ్ లెంగ్త్, రిథమ్​తో బౌలింగ్ చేసిన అర్ష్​దీప్.. వేడ్​ను ముప్పుతిప్పలు పెట్టి ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నాథన్ ఎల్లిస్ మంచి షాట్ కొట్టాడు. కానీ ఆ బాల్ కాస్తా అర్ష్​దీప్​ చేతితో పాటు అంపైర్​ కాలికి తాకింది. దీంతో కేవలం ఒక్క రన్​ తీశారు. అంపైర్​కు తాకకపోతే అది ఫోర్​ అయ్యేది. ఒకవేళ ఆ బాల్ గనుక బౌండరీకి వెళ్లుంటే ఆసీస్ విజయానికి మరో 6 రన్స్ అవసరమయ్యేవి. మ్యాచ్​లో రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదం కూడా ఉండేది. దీంతో భారత్​ను అంపైర్ కాపాడాడని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంపైర్ సూపర్బ్​గా ఫీల్డింగ్ చేశాడని చెబుతున్నారు. మరి.. ఆఖరి టీ20లోనూ ఆసీస్​ను భారత్ మట్టికరిపించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs AUS: ఒక్క ఓవర్​తో మ్యాచ్​ను భారత్ వైపు తిప్పిన అర్ష్​దీప్.. ఏం వేశాడు భయ్యా!