iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Author singhj Published - 09:11 AM, Thu - 23 November 23

వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ రూపంలో ఆడియెన్స్​, ఫ్యాన్స్​ను అలరించేందుకు టీమిండియా రెడీ అయిపోయింది.

వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ రూపంలో ఆడియెన్స్​, ఫ్యాన్స్​ను అలరించేందుకు టీమిండియా రెడీ అయిపోయింది.

  • Author singhj Published - 09:11 AM, Thu - 23 November 23
ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి భారత్​ను ఇంకా వెన్నాడుతోంది. 140 కోట్ల మంది ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయామనే బాధ వారిలో ఇంకా ఉంది. 12 ఏళ్ల విరామం తర్వాత మరో ప్రపంచ కప్ నెగ్గి.. కప్ డ్రీమ్ నెరవేర్చుదామనుకున్నా అలా చేయలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నారు. కానీ అది గతం. ఇప్పుడు మళ్లీ ఫ్రెష్​గా స్టార్ట్ చేయాలి. ఆ ఓటమిని మర్చిపోయి మరో కప్ దిశగా భారత క్రికెట్ జట్టు సరికొత్త జర్నీని మొదలుపెట్టాల్సిన టైమ్ వచ్చేసింది. వచ్చే ఏడాది జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​పై ఫోకస్ చేయాల్సిన తరుణమిది. మనమే కాదు.. వన్డే వరల్డ్ కప్ ఎగరేసుకుపోయిన ఆసీస్​ కూడా మళ్లీ తాజాగా ఆరంభించనుంది.

వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్లో తలపడిన భారత్-ఆస్ట్రేలియాలు మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు జరగబోయేది ఐదు మ్యాచుల టీ20 సిరీస్. ప్రపంచ కప్ నెగ్గిన జోష్​లో ఉన్న ఆసీస్​కు, ఓడిపోయి బాధలో కూరుకుపోయిన టీమిండియాకు మధ్య సిరీస్​ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరు టీమ్స్ టీ20 వరల్డ్ కప్​ను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాయి. కాబట్టి ఈ సిరీస్​ చాలా టఫ్​గా ఉండనుంది. అయితే మెగా టోర్నీ ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తుంది. కాబట్టి మన ప్లేయర్లు మరింత పట్టుదలతో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్​లో భాగంగా ఇవాళ ఫస్ట్ టీ20 విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ ఫార్మాట్​ కోసం ప్లేయర్లు, కోచ్​లు అందరూ మారారు.

వరల్డ్ కప్ టీమ్​లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఆసీస్​తో సిరీస్​లో ఆడనున్నారు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చివరి రెండు మ్యాచులకు అందుబాటులో ఉంటాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో వీవీఎస్ లక్ష్మణ్​ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అటు కంగారూ టీమ్​కు ఆండ్రూ బోర్​వెక్ మొదటిసారి కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టులో కమిన్స్, మిచెల్ మార్ష్, వార్నర్, హేజల్​వుడ్, స్టార్క్, గ్రీన్ దూరమయ్యారు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచ కప్​తో పాటు డిసెంబర్ 19న మినీ వేలం కూడా ఉండటంతో ఈ సిరీస్​తో సత్తా చాటాలని ప్లేయర్స్ చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి కాంబినేషన్​ను ఎంచుకుంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

భారత టీమ్​లో వికెట్ కీపర్​గా ఇషాన్ కిషన్ ఆడతాడు. అయితే యశస్వి జైస్వాల్​తో కలసి ఓపెనింగ్ చేస్తాడా? లేదా వైఎస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్​ ఓపెనింగ్​కు వస్తే ఇషాన్ మిడిలార్డర్​లో ఆడతాడా? అనేది చూడాలి. కెప్టెన్ సూర్యకుమార్ ఫస్ట్ డౌన్​లో బ్యాటింగ్​కు దిగే ఛాన్స్ ఉంది. అతడి తర్వాత వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకూ సింగ్ ఆడొచ్చు. బౌలింగ్​లో అర్ష్​దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్​ రూపంలో ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో అర్ష్​దీప్, ప్రసిద్ధ్​ ప్లేస్ పక్కాగా కనిపిస్తోంది. ఒకవేళ అవేశ్ ఖాన్ కావాలనుకుంటే ముకేష్​ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. స్పిన్‌ ఆల్​రౌండర్​గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్​లో ఒకర్ని ఆడించొచ్చు.

ఇదీ చదవండి: షమీ వల్లే భారత్ ఫైనల్లో ఓడిపోయింది.. దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!