iDreamPost
android-app
ios-app

తొలి టీ-20 ముందు ఆటగాళ్లకు సూర్య వార్నింగ్! కెప్టెన్ అయ్యేసరికి..!

  • Author singhj Published - 10:32 AM, Thu - 23 November 23

వన్డే వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాతో ఐదు టీ20 సిరీస్​లో భాగంగా మొదటి మ్యాచ్​కు భారత్ రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్​కు ముందు ఆటగాళ్లకు కెప్టెన్ సూర్యకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

వన్డే వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాతో ఐదు టీ20 సిరీస్​లో భాగంగా మొదటి మ్యాచ్​కు భారత్ రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్​కు ముందు ఆటగాళ్లకు కెప్టెన్ సూర్యకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

  • Author singhj Published - 10:32 AM, Thu - 23 November 23
తొలి టీ-20 ముందు ఆటగాళ్లకు సూర్య వార్నింగ్! కెప్టెన్ అయ్యేసరికి..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో భారత్ ఓటమి బాధ నుంచి ఇంకా ఫ్యాన్స్ బయటకు రాలేకపోతున్నారు. ఎన్నో ఆశలు రేపి ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ కల నెరవేరుతుందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురవ్వడంతో తట్టుకోలేకపోతున్నారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇంక గ్రౌండ్​లోకి దిగి ఆడిన ఆటగాళ్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వెంటాడుతున్న పరాజయం బాధలో నుంచి అందరూ బయటపడాల్సిన తరుణం వచ్చేసింది.

టీమిండియా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సిన టైమ్ వచ్చేసింది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​కు మరో ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి పొట్టి ఫార్మాట్​ కప్​ కోసం సన్నాహకాలు ప్రారంభించాలి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లాంటి ఓటములు రావొద్దంటే ఇప్పటినుంచి ప్లాన్స్​కు తగ్గట్లు మరింత పకడ్బందీగా టీమ్​ను తయారు చేసుకోవాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో మరింత బలోపేతం అవ్వాల్సి ఉంటుంది. పేస్ ఆల్​రౌండర్లు, స్పిన్ ఆల్​రౌండర్లను కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రయోగాలు చేసేందుకు ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పటి నుంచి ఆడే ప్రతి టీ20 భారత జట్టుకు చాలా కీలకం కానుంది. టీ20 వరల్డ్ కప్ జర్నీని ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్​తో మొదలుపెట్టనుంది టీమిండియా.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన ఇండియా-ఆసీస్ మరోమారు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య జరగనున్న టీ20 సిరీస్​లోని ఫస్ట్ మ్యాచ్​కు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రపంచ కప్ జట్టులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్​ కృష్ణ, ఇషాన్ కిషన్ మాత్రమే ఈ సిరీస్​లో బరిలోకి దిగనున్నారు. అక్షర్ పటేల్, సూర్యలు మాత్రమే టీమ్​లో సీనియర్లు. మిగతా వాళ్లంతా జట్టు తరఫున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడారు. ఈ సిరీస్​లో టీమిండియాకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు సూర్యకుమార్. యువకులతో నిండిన జట్టుతో ఆసీస్ లాంటి పటిష్టమైన టీమ్​ను సూర్య ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో లేదో టీమ్​లోని ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ టీ20కి ముందు ఒక విషయంలో ఆటగాళ్లను హెచ్చరించాడు మిస్టర్ 360. వ్యక్తిగత రికార్డుల కంటే గెలుపే ముఖ్యమని టీమ్ మీటింగ్​లో స్పష్టం చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా తానే రివీల్ చేశాడు. ‘ఎవరూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడొద్దని ఆటగాళ్లకు చెప్పా. నాకు పర్సనల్ మైల్​స్టోన్స్ మీద అంత ఆసక్తి లేదు. రికార్డుల కంటే టీమ్​ గెలుపే ముఖ్యం’ అని సూర్య చెప్పాడు. మిస్టర్ 360 కామెంట్స్ విన్న నెటిజన్స్ అతడ్ని పొగుడుతున్నారు. కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలని.. పర్సనల్ రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని అంటున్నారు. రికార్డుల కోసం కాకుండా టీమ్ గెలుపు కోసం డేరింగ్​గా ఆడాలని సూచిస్తున్నారు. మరి.. రికార్డులు కాదు.. విజయం సాధించడమే ముఖ్యం అంటున్న సూర్య వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!