Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. కంగారూ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడుతున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. కంగారూ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడుతున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. కంగారూ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో తమను ఓడించిన ఆసీస్ మీద పగతో రగిలిపోతున్న హిట్‌మ్యాన్.. ఆ టీమ్‌కు ఒక రేంజ్లో పోయిస్తున్నాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడతను. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. ఆసీస్ టీమ్‌లో ఏ బౌలర్‌ను కూడా అతడు వదల్లేదు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్‌ను టార్గెట్ చేసుకొని ఊచకోత కోశాడు.
కమిన్స్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి స్లాగ్ స్వీప్ బాదాడు రోహిత్. అతడి దెబ్బకు బంతి వెళ్లి స్టేడియం బయట పడింది. హిట్‌మ్యాన్ కొట్టిన టైమింగ్‌కు బాల్ 100 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. దీంతో కమిన్స్ సహా ఆసీస్ ఆటగాళ్లంతా షాకయ్యారు. ఇదేం బాదుడు సామి అంటూ ఆశ్చర్యపోయారు. రోహిత్ బాగా ఆడతాడని ఊహించినా.. ఈ రేంజ్లో అతడి నుంచి విధ్వంసాన్ని ఎక్స్పెక్ట్ చేయని ప్రత్యర్థి ఆటగాళ్లు ఏం చేయాలో పాలుపోక గుడ్లు తేలేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 6.2 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 67. మరి.. రోహిత్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Rohit Sharma slog swept Pat Cummins for a 100M six. 🤯 pic.twitter.com/ISc6L87wOo
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024