iDreamPost
android-app
ios-app

వింటేజ్ రోహిత్ ఈజ్ బ్యాక్.. కమిన్స్​కు నిద్రపట్టకుండా చేసే షాట్ ఇది!

  • Published Jun 24, 2024 | 8:50 PMUpdated Jun 24, 2024 | 10:29 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగుతున్నాడు. కంగారూ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడుతున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగుతున్నాడు. కంగారూ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో తమను ఓడించిన ఆసీస్ మీద పగతో రగిలిపోతున్న హిట్​మ్యాన్.. ఆ టీమ్​కు ఒక రేంజ్​లో పోయిస్తున్నాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడతను. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. ఆసీస్ టీమ్​లో ఏ బౌలర్​ను కూడా అతడు వదల్లేదు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్​ను టార్గెట్ చేసుకొని ఊచకోత కోశాడు.

కమిన్స్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి స్లాగ్ స్వీప్ బాదాడు రోహిత్. అతడి దెబ్బకు బంతి వెళ్లి స్టేడియం బయట పడింది. హిట్​మ్యాన్​ కొట్టిన టైమింగ్​కు బాల్ 100 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. దీంతో కమిన్స్ సహా ఆసీస్ ఆటగాళ్లంతా షాకయ్యారు. ఇదేం బాదుడు సామి అంటూ ఆశ్చర్యపోయారు. రోహిత్ బాగా ఆడతాడని ఊహించినా.. ఈ రేంజ్​లో అతడి నుంచి విధ్వంసాన్ని ఎక్స్​పెక్ట్ చేయని ప్రత్యర్థి ఆటగాళ్లు ఏం చేయాలో పాలుపోక గుడ్లు తేలేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 6.2 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 67. మరి.. రోహిత్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి