IND vs AUS Rohit Sharma 200 Sixes Record: చరిత్ర సృష్టించిన రోహిత్.. వరల్డ్ క్రికెట్​లో ఒకే ఒక్కడు!

చరిత్ర సృష్టించిన రోహిత్.. వరల్డ్ క్రికెట్​లో ఒకే ఒక్కడు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరుతో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరుతో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు.

విధ్వంసం, సునామీ, తుఫాను.. ఏ పదమైనా టీమిండియా కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్​కు న్యాయం చేయలేదనే చెప్పాలి. టీ20 ప్రపంచ కప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో ఫుల్ ఇంటెంట్​తో బ్యాటింగ్ చేశాడు హిట్​మ్యాన్. తొలి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ కంగారూ బౌలర్లను ఠారెత్తించాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్​ను టార్గెట్ చేసుకొని సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడు చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్​లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్​గా నిలిచాడు.

పొట్టి క్రికెట్​లో సిక్సుల విషయంలో రోహిత్​కు దరిదాపుల్లో ఒక్క ప్లేయర్ కూడా లేడు. 173 సిక్సర్లతో మార్టిన్ గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో జాస్ బట్లర్ (137 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (129 సిక్సులు) ఉన్నారు. ఇక, ఆసీస్​తో మ్యాచ్​లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు రోహిత్. ప్రస్తుతం అతడు 34 బంతుల్లో 85 పరుగులతో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్​లో 6 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 244గా ఉండటం విశేషం. మరి.. రోహిత్ సిక్సర్ల రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments