భారత నయా స్పీడ్‌స్టర్ ముకేశ్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.
భారత నయా స్పీడ్‌స్టర్ ముకేశ్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.
రీసెంట్గా ఆస్ట్రేలియాతో ముగిసిన 5 టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. ప్రపంచ కప్ ముగిసిన నాల్రోజుల్లోనే స్టార్ట్ అయిన ఈ సిరీస్ మీద ముందు అంత ఇంట్రెస్ట్ ఎవరికీ కలగలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్‌ను ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఒక్కసారి మ్యాచులు మొదలయ్యాక మాత్రం అందర్నీ తమ వైపు తిప్పుకుంది యంగ్ ఇండియా. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కంగారూలతో సిరీస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేశ్ కుమార్ లాంటి యంగ్‌స్టర్స్ అద్భుతంగా రాణించారు. ఓపెనింగ్‌లో జైస్వాల్, గైక్వాడ్ అదరగొట్టారు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో మరోమారు సత్తా చాటాడు. కొత్త కుర్రాడైన జితేష్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కీపింగ్‌తో పాటు అటు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడు. ఎంత ఒత్తిడి ఉన్నా టెన్షన్ పడకుండా మ్యాచ్‌లను ముగించాడు.
స్పిన్నర్ రవి బిష్ణోయ్ పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలోనూ కీలకమైన బ్రేక్ త్రూలు అందించాడు. ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ మొదట్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినా ఆఖరి ఓవర్లలో మాత్రం అపోజిషన్ టీమ్ భరతం పట్టారు. లాస్ట్ టీ20లో అర్ష్‌దీప్ ఫైనల్ ఓవర్ కట్టుదిట్టంగా వేసి భారత్‌ను గెలిపించాడు. పేస్ బౌలర్లలో ముకేశ్ అందరికంటే ఎక్కువగా మార్కులు కొట్టేశాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమి వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. షమీలాగే పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను పోయించాడు. అలాంటి ఈ బౌలర్ సిరీస్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ కోసం మూడో టీ20కి దూరమయ్యాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దివ్యా సింగ్ అనే అమ్మాయిని ముకేశ్ వివాహం చేసుకున్నాడు. అయితే మ్యారేజ్ కోసం మధ్యలోని వెళ్లిపోయిన ఈ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌కు ఆఖరి రెండు మ్యాచుల్లో ఆడే ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. ఐదో టీ20లోనైతే ముకేశ్ చెలరేగి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీశాడు. వరుసగా మ్యాట్ షార్ట్‌తో పాటు బెన్ డ్వార్ష్యూస్ను ఔట్ చేశాడు. దీంతో ముకేశ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. జూనియర్ షమి మ్యాచ్ మ్యాచ్‌కు మరింత మెరుగవుతున్నాడని అంటున్నారు. పెళ్లి చేసుకోవడం అతడికి కలిసొచ్చింది.. అతడి వైఫ్ లక్ వల్లే ముకేశ్ సక్సెస్ అయ్యాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పెళ్లితో ముకేశ్ లక్ మారిపోయందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!