రీసెంట్గా ముగిసిన టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో ఓటమికి కుంటిసాకులు వెతకడం మొదలుపెట్టింది కంగారూ టీమ్.
రీసెంట్గా ముగిసిన టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో ఓటమికి కుంటిసాకులు వెతకడం మొదలుపెట్టింది కంగారూ టీమ్.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమికి కొంత రివేంజ్ తీసుకుంది టీమిండియా. కంగారూలతో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది భారత్. తద్వారా అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. పోటాపోటీగా సాగిన ఈ సిరీస్‌లో మన టీమ్ బాగా డామినేట్ చేసింది. స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్ లాంటి స్టార్ ప్లేయర్లతో ఈ సిరీస్‌లో ఆడింది ఆసీస్. అటు భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ తప్ప అనుభవజ్ఞులు ఎవరూ లేరు. శ్రేయస్ అయ్యర్ ఆఖరి రెండు మ్యాచుల్లో బరిలోకి దిగాడు. స్టార్లు ఎవరూ టీమ్‌లో లేకున్నా యంగ్‌స్టర్స్ అద్భుతంగా ఆడి గెలిపించారు.
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకూ సింగ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లు ఆకట్టుకున్నారు. అక్షర్, సూర్యలు తమ అనుభవంతో టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మిస్టర్ 360 అటు బ్యాటింగ్‌లో మెరవడంతో పాటు ఇటు బౌలింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో విజయం, యువ ఆటగాళ్లు రాణించడం భారత్‌కు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. కంగారూ సిరీస్ ముగిసిపోవడంతో నెక్స్ట్ జరిగే సౌతాఫ్రికా టూర్ఫై భారత్ ఫోకస్ పెడుతోంది.
సఫారీ టూర్‌కు సంబంధించి ఆడబోయే టీమ్స్‌ను ఇప్పటికే ప్రకటించింది బీసీసీఐ. ఆ సిరీస్‌లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించి ఆశ్చర్యపర్చింది. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ ఆ సిరీస్‌లో కెప్టెన్లుగా ఉండనున్నారు. సఫారీ టూర్లో యంగ్‌స్టర్స్‌కు మరిన్ని ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటోందట. ఒకవైపు భారత్ తన తర్వాతి సిరీస్‌లతో బిజీ అయిపోతే మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం టీ20 సిరీస్ దగ్గరే ఆగిపోయింది. ఆ సిరీస్‌లో ఓటమికి కుంటిసాకులు వెతుకుతోంది. తమ ప్లేయర్ల వైఫల్యాన్ని కారణంగా చూపకుండా.. అంపైరింగ్ తప్పిదాల వల్లే సిరీస్ కోల్పోయామని అంటోంది.
ఐదు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లింది. చివరి ఓవర్లో ఆసీస్ గెలుపునకు 10 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఆ జట్టు కేవలం 3 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. వేడ్ లాంటి పించ్ హిట్టర్ కూడా ఫైనల్ ఓవర్ వేసిన అర్ష్‌దీప్‌ను ఎదుర్కోలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో రాంగ్ షాట్ ఆడి ఔటయ్యాడు. అయితే ఆ ఓవర్ ఫస్ట్ బాల్‌ను అర్ష్‌దీప్ బౌన్సర్‌గా వేయగా.. వేడ్ పుల్ షాట్ ఆడబోయి ఫెయిలయ్యాడు. బాల్ బ్యాటర్ కంటే ఎక్కువ ఎత్తులో వెళ్లినా అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీంతో షాకైన వేడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ఆసీస్ సీనియర్ ప్లేయర్ మ్యాథ్యూ హేడెన్. తమ టీమ్ ఓటమికి అంపైర్ వైడ్ ఇవ్వకపోడమే కారణమన్నాడు.
ఆ ఓవర్లో ఆసీస్ బ్యాటర్ కొట్టిన మరో బాల్ అర్ష్‌దీప్ చేతితో పాటు అంపైర్ కాలికి తగిలి ఆగిపోయింది. అంపైర్‌కు తగలకపోతే అది బౌండరీలోకి పోయేది. అందుకే ఈ బాల్ గురించి స్పందిస్తూ.. అంపైర్ మరోమారు తన పాత్రను విజయవంతంగా పోషించాడని హేడెన్ విమర్శించాడు. అయితే అంపైర్ ఉద్దేశపూర్వకంగా అలా చేయకపోయినా హేడెన్ అతడ్ని టార్గెట్ చేయడం తప్పని నెటిజన్స్ అంటున్నారు. ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఓడిపోయి ఆ నెపాన్ని ఇంకొకరి మీద నెట్టడం ఏంటని సీరియస్ అవుతున్నారు. భారత్ విషయంలోనూ కొన్ని డెసిజన్స్ తప్పుగా ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. మరి.. అంపైర్ వల్లే ఓడామంటూ హేడెన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!
When the umpire is relieved that the impact isn’t in line 😅#INDvAUS #IDFCFirstBankT20ITrophy #JioCinemaSports pic.twitter.com/67VD3ej9um
— JioCinema (@JioCinema) December 3, 2023