iDreamPost
android-app
ios-app

మూడో వన్డే కోసం లోకల్ ప్లేయర్లను దించుతున్న టీమిండియా.. కారణం?

  • Author singhj Published - 09:09 AM, Wed - 27 September 23
  • Author singhj Published - 09:09 AM, Wed - 27 September 23
మూడో వన్డే కోసం లోకల్ ప్లేయర్లను దించుతున్న టీమిండియా.. కారణం?

వరల్డ్ కప్​కు ముందు ఆస్ట్రేలియా సిరీస్​ ఆడటం టీమిండియాకు చాలా విధాలుగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ సిరీస్​ ద్వారా భారత బ్యాటర్లు, బౌలర్లకు మంచి ప్రాక్టీస్ దొరికింది. ఫామ్​లేమితో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఆసీస్​తో తొలి రెండు వన్డేల్లో రాణించి తానేంటో నిరూపించుకున్నాడు. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్​, ఫిట్​నెస్​ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈమధ్య ఎక్కువగా ఛాన్సులు రాక బెంచ్​కే పరిమితమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా వచ్చిన ఛాన్స్​ను సద్వినియోగం చేసుకున్నాడు. తొలి వన్డేలో 5 వికెట్లు తీసి తన బౌలింగ్​లో పస తగ్గలేదని నిరూపించాడు. ఇలా అనేక విధాలుగా ఈ సిరీస్​ భారత్​కు అనుకూలంగా మారింది.

ఆసీస్​తో తొలి రెండు వన్డేల్లో నెగ్గిన టీమిండియా ఆఖరి మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. వన్డేల్లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కంగారూలను భారత్ వైట్​వాష్ చేయలేదు. దీంతో ఈసారి ఛాన్స్​ను అస్సలు వదలొద్దని రోహిత్ సేన అనుకుంటోంది. తొలి రెండు మ్యాచ్​లకు రెస్ట్ తీసుకున్న హిట్​మ్యాన్ ఈ మ్యాచ్​తో తిరిగి టీమ్​లోకి రానున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ కూడా బరిలోకి దిగుతారు. అయితే టీమ్​ను వైరల్ ఫీవర్ పీడిస్తోంది. పలు కారణాల వల్ల మూడో వన్డేకు భారత్​కు 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలెక్షన్​కు అందుబాటులో ఉన్నారు.

చివరి వన్డే కోసం శుబ్​మన్​ గిల్​కు రెస్ట్ ఇచ్చారు. పేసర్లు మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్​తో పాటు సిరీస్​లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ పాండ్యా ఇంటికి వెళ్లిపోయారు. కొందరు జ్వరం కారణంగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఇద్దరికి మించి ఆటగాళ్లు గాయపడితే సహాయక సిబ్బంది లేదా లోకల్ ప్లేయర్లతో ఫీల్డింగ్ చేయించాల్సిన పరిస్థితి భారత్​కు రానుంది. అందుకే ముందు జాగ్రత్తగా లోకల్ ప్లేయర్లను బ్యాకప్​గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉంటూ దేశవాళీ క్రికెట్​లో రాణిస్తున్న ఆటగాళ్లను పిలిచిపించారట. వీళ్లతో ప్రాక్టీస్ చేయించిన టీమిండియా మేనేజ్​మెంట్.. మ్యాచ్​ టైమ్​లో అవసరమైతే వీరిని సబ్​స్టిట్యూట్ ఫీల్డర్లుగా వాడుకోనుందని సమాచారం.

ఇదీ చదవండి: స్మృతి మంథాన కోసం 1,200 కి.మీ.లు జర్నీ చేసిన చైనా ఫ్యాన్!