iDreamPost
android-app
ios-app

IND vs AUS: ఒక్క ఓవర్​తో మ్యాచ్​ను భారత్ వైపు తిప్పిన అర్ష్​దీప్.. ఏం వేశాడు భయ్యా!

  • Author singhj Updated - 06:45 PM, Mon - 4 December 23

ఆసీస్​తో ఆఖరి టీ20లో స్పీడ్​స్టర్ అర్ష్​దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి. అతడి బౌలింగ్ చూసి ఏం వేశాడు భయ్యా అంటున్నారు అభిమానులు.

ఆసీస్​తో ఆఖరి టీ20లో స్పీడ్​స్టర్ అర్ష్​దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి. అతడి బౌలింగ్ చూసి ఏం వేశాడు భయ్యా అంటున్నారు అభిమానులు.

  • Author singhj Updated - 06:45 PM, Mon - 4 December 23
IND vs AUS: ఒక్క ఓవర్​తో మ్యాచ్​ను భారత్ వైపు తిప్పిన అర్ష్​దీప్.. ఏం వేశాడు భయ్యా!

యంగ్ భారత్ దూకుడు మామూలుగా లేదు. సీనియర్లతో కూడిన పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్​ను గెలుచుకున్న టీమిండియా.. లాస్ట్ పంచ్ కూడా ఇచ్చి ఫ్యాన్స్​కు ఆనందాన్ని పంచింది. కంగారూ జట్టుతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​ను 4-1తో ముగించింది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉండటంతో హైదరాబాద్​లో జరగాల్సిన ఐదో టీ20ని బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో ఆసీస్​ను 6 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. ట్రిక్కీ పిచ్ మీద టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మన జట్టు.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే శ్రేయస్ అయ్యర్ (53) వల్లేనని చెప్పాలి.

బ్యాటింగ్​కు కష్టంగా మారిన పిచ్ మీద నిలబడితే రన్స్ ఈజీగా వస్తాయని గ్రహించాడు అయ్యర్. తొలుత జితేష్ శర్మ (24) ఆ తర్వాత అక్షర్ పటేల్ (31)తో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయ్యర్ పట్టుదలతో ఆడకపోయి ఉంటే టీమిండియా 160 చేయగలిగేది కాదు. ఇది తక్కువ స్కోరుగా అనిపించినా మందకొడి పిచ్ మీద ఛేజింగ్ కష్టం కాబట్టి భారత్​కు గెలుపు అవకాశాలు కనిపించాయి. ఛేజింగ్​కు దిగిన ఆసీస్​ను ఆదిలోనే దెబ్బకొట్టాడు పేసర్ ముకేష్ కుమార్. జోష్ ఫిలిప్ (4)ను వెనక్కి పంపాడు. ట్రావిస్ హెడ్ (28) కాసేపు భయపెట్టినప్పటికీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అతడ్ని బౌల్డ్ చేశాడు.

ఆరోన్ హార్డ్ (6)నూ బిష్ణోయే ఔట్ చేశాడు. అయితే టిమ్ డేవిడ్ (17), మ్యాట్ షార్ట్ (16)తో కలసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పాడు బెన్ మెక్​డెర్మాట్ (54). ఐదు భారీ సిక్సులు బాదిన బెన్.. ఆసీస్​ను గెలిపించేలా కనిపించాడు. కానీ అతడ్ని పేసర్ అర్ష్​దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆఖర్లో మ్యాథ్యూ వేడ్ (22) తన టీమ్​ను గెలిపించేందుకు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్​లో అసలైన హీరో మాత్రం అర్ష్​దీప్ అనే చెప్పాలి. ఆఖరి ఓవర్​లో ఆస్ట్రేలియా గెలుపునకు 10 రన్స్ కావాలి. క్రీజులో ఉన్నది డేంజరస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్. అంతకుముందు 3 ఓవర్లు వేసిన అర్ష్​దీప్ 37 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో అతడితో లాస్ట్ ఓవర్ వేయించి సూర్యకుమార్ తప్పు చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ డెసిజన్ వర్కౌట్ అయింది. చివరి ఓవర్​లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు అర్ష్​దీప్.

ఒక్కసారిగా రిథమ్​లోకి వచ్చిన అర్ష్​దీప్ సూపర్బ్​గా బౌలింగ్ చేశాడు. 138 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్ల స్పీడ్​తో బౌలింగ్ చేస్తూ వేడ్​ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడికి రన్స్ ఇవ్వడం పక్కనబెడితే బాల్ కూడా టచ్ కాకుండా చూసుకున్నాడు. దీంతో ఫ్రస్టేషన్​లో షాట్ కొట్టబోయి ఔటయ్యాడు వేడ్. ఆ తర్వాత కూడా ఆఖరి మూడు బంతులు అద్భుతంగా వేసి మ్యాచ్​ను భారత్​ వైపు తిప్పాడు అర్ష్​దీప్. అంతుకుముందు ఓవర్​లో ముకేశ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. వేడ్ సూపర్ టచ్​లో ఉన్నాడు గనుక 10 రన్స్ ఈజీగా కొట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ కూల్​గా, కంపోజ్​గా కనిపించిన అర్ష్​దీప్ తన పని తాను చేసుకుపోయాడు. బ్యాటింగ్​లో అయ్యర్ చేసిన పనిని బౌలింగ్​లో అర్ష్​దీప్ చేసి జట్టును గెలిపించాడు. అందుకే ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ఓవర్ శానా యేళ్లు యాదుంటాది అంటున్నారు. మరి.. అర్ష్​దీప్ లాస్ట్ ఓవర్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs AUS: ఆసీస్​తో ఆఖరి టీ20.. టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!